దటీజ్ తెరియా! | thatis Teriya | Sakshi
Sakshi News home page

దటీజ్ తెరియా!

Jun 29 2014 10:58 PM | Updated on Sep 2 2017 9:34 AM

దటీజ్ తెరియా!

దటీజ్ తెరియా!

పోటీ పడనిదే గెలుపు దక్కదు. పరుగు తీయనిదే గమ్యం అందదు. తెరియాకి గెలుపు దక్కింది. ఇక గమ్యాన్ని చేరుకోవడమే మిగిలింది.

విజయం
 
పోటీ పడనిదే గెలుపు దక్కదు. పరుగు తీయనిదే గమ్యం అందదు. తెరియాకి గెలుపు దక్కింది. ఇక గమ్యాన్ని చేరుకోవడమే మిగిలింది. ఇంతకీ ఆమె గమ్యం ఏమిటో తెలుసా... తన అభిమాన నటి సోనాక్షి సిన్హాలా నటి కావడం!
 
డ్యాన్‌‌స ఇండియా డ్యాన్‌‌స లిటిల్ మాస్టర్‌‌స సీజన్ 3 ఫైనల్స్‌లో ఆఖరి రౌండ్ ముగిసింది. అందరూ ఊపిరి బిగబట్టి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పోటీలో పాల్గొన్న చిన్నారులంతా టెన్షన్ పడుతున్నారు. న్యాయ నిర్ణేతల నోటి వెంట ఎవరి పేరు వినిపిస్తుందోనని చెవులు రిక్కించి నిలబడ్డారు. వాళ్లు ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చింది. విజేత పేరు వెలువడింది. స్టేజిమీద నిలబడిన పదకొండేళ్ల తెరియా మగర్ ముఖం... గెలుపు తెచ్చిన ఆనందంతో వెలిగిపోయింది. రాత్రికి రాత్రే ఆ చిన్నారి పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది.
 
నేపాల్‌లోని రుద్రపూర్ గ్రామంలో జన్మించింది తెరియా. అడుగులు పడుతున్నప్పుడే డ్యాన్సు స్టెప్పులు వేయడం ప్రారంభించింది. కూతురి ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. చదువులో సైతం అత్యంత చురుగ్గా ఉండే ఈ చిచ్చర పిడుగు... డ్యాన్‌‌స ఇండియా డ్యాన్‌‌సలో చోటు సంపాదించింది. కానీ గెలుస్తుంది అనైతే ఆమె ఇంట్లోవాళ్లుగానీ, ఆమె గానీ ఊహించనేలేదు. అందుకే ఆ విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని అంటోంది... సీజన్ 3 టైటిల్‌తో పాటు పది లక్షల నగదు అవార్డును కూడా గెలుచుకున్న తెరియా.
 
ఇప్పుడే ఇంత సాధించావ్, పెద్దయ్యాక ఏం చేస్తావ్ అంటే.. మరో సోనాక్షీసిన్హాని అవుతా అంటోంది తెరియా తడుముకోకుండా. సోనాక్షి అన్నా, ఆమె నటన, డ్యాన్‌‌స తనకి చాలా ఇష్టమని, ఆమెలానే నటినవుతా అంటోంది తెరియా. అంతేకాదు... కొరియోగ్రఫీ కూడా చేస్తుందట. మరో ఏడెనిమిదేళ్లు గడిస్తే మనం మరో సోనాక్షిని తప్పక చూడొచ్చు. ఎందుకంటే... తెరియా చెప్పిందంటే చేసి తీరుతుంది. అనుకున్నది సాధించి చూపిస్తుంది!
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement