ఆ నేడు 14 సెప్టెంబర్, 1981 | That today, 14 September, 1981 | Sakshi
Sakshi News home page

ఆ నేడు 14 సెప్టెంబర్, 1981

Sep 13 2015 11:17 PM | Updated on Sep 3 2017 9:20 AM

ఆ  నేడు  14 సెప్టెంబర్, 1981

ఆ నేడు 14 సెప్టెంబర్, 1981

ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం ప్రకారం బ్రిటన్‌లో ఏటా ‘ట్రూపింగ్ ద కలర్’ వేడుక జరుగుతుంది.

క్వీన్ ఎలిజబెత్‌పై కాల్పులు!
 
ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం ప్రకారం బ్రిటన్‌లో ఏటా ‘ట్రూపింగ్ ద కలర్’ వేడుక జరుగుతుంది. సైన్యంలోని అన్ని రెజిమెంట్‌లు ఈ ఉత్సవంలో తమ రంగులను, జెండాలను ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమానికి ఇంగ్లండ్ మహారాణి ముఖ్య అతిథిగా హాజరవుతారు. 1981 జూన్‌లో ఇలాగే ట్రూపింగ్ వేడుకలు జరుగుతున్నప్పుడు వాటికి హాజరవుతున్న క్వీన్ ఎలిజబెత్ 2 పై హత్యాయత్నం జరిగింది.

అందుకు ప్రయత్నించింది మార్కస్ సార్జెంట్ అనే 17 ఏళ్ల కుర్రాడు! అయితే అతడు పేల్చిన తుపాకీలో గన్‌పౌడర్ తప్ప బులెట్‌లు తేకపోవడంతో పెద్ద దుర్ఘటన తప్పిపోయింది. జాన్.ఎఫ్.కెన్నెడీ, జాన్ లెన్నన్‌ల హత్యోదంతాలతో స్ఫూర్తి పొందిన మార్కస్‌కు కోర్టు ఆ ఏడాది సెప్టెంబర్ 14న జైలుశిక్ష విధించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement