హరివిల్లులా ఉంటే వారు వీరవుతారు! | special to Eyebrow | Sakshi
Sakshi News home page

హరివిల్లులా ఉంటే వారు వీరవుతారు!

Aug 29 2016 11:30 PM | Updated on Sep 4 2017 11:26 AM

హరివిల్లులా ఉంటే వారు వీరవుతారు!

హరివిల్లులా ఉంటే వారు వీరవుతారు!

ప్రముఖ ఫెంగ్‌షు నిపుణురాలు ప్రియా షేర్ ‘కనుబొమలు- మనుషుల మనస్తత్వాలు’ అనే విషయంపై చాలాకాలంగా పరిశోధన చేస్తున్నారు.

 కనుబొమలు


ప్రముఖ ఫెంగ్‌షు నిపుణురాలు ప్రియా షేర్ ‘కనుబొమలు- మనుషుల మనస్తత్వాలు’ అనే విషయంపై చాలాకాలంగా పరిశోధన చేస్తున్నారు.  కనుబొమల్ని బట్టి మనిషి స్వభావాన్ని అంచనా వెయ్యొచ్చని గతంలో ఆమె ఆసక్తికరమైన కొన్ని విషయాలను వెల్లడించారు.  ఇప్పడు వాటికి మరిన్ని విశేషాలు జోడించారు.  అద్దంలో మీ కను బొమల్ని చూసుకోండి. మీరేమిటో తెలుసుకోండి.


ఇంద్రధనుసులా వంగివుండే కనుబొమలు కల పురుషులు సెన్సెటివ్‌గా... మహిళలైతే మొండిగా ఉంటారట.  సన్నని గీతలా ఉండే కనుబొమలు కలవారు చాలా మృదు స్వభావులై ఉంటారట. చివర్లు వంపు తిరిగి ఉండే కనుబొమలు కలవారు సృజనాత్మకత కలవారై ఉంటారట. కనుబొమలు నల్లగా కాకుండా బ్రౌన్ కలర్లో ఉంటే... వారిలో ప్రణయ భావనలు అధికంగా ఉంటాయట. అదే కనుబొమలు మెత్తగా లేకుండా రఫ్‌గా ఉంటే... అటువంటి భావనలు తక్కువగా ఉంటాయట.  తిన్నగా గీత గీసినట్టుగా ఉండే కనుబొమలు ఉన్నవారు దృఢచిత్తం కలవారై ఉంటారట. ఒకవేళ మహిళలైతే వారిలో కాస్త పురుషత్వం కనిపిస్తూ ఉంటుందట.

కన్నులకు మరీ దూరంగా, పైన ఎక్కడో ఉన్నట్టుగా కనుబొమలు ఉంటే... వారికి కలలు, కోరికలు ఎక్కువుంటాయట. అదే కనుబొమలు కన్నులకు చాలా దగ్గరగా ఉంటే... వారిలో నిబద్ధత, ప్రతి పని పట్ల శ్రద్ధ కనిపిస్తుందట. అలాగే వీరు పరమ జాగ్రత్తపరులట. కొన్నిసార్లు తమ పనిలో పడి ఇతరులను కూడా పట్టించుకోరట.


కంటికీ కనుబొమకీ మధ్య ఉండే దూరం ఒక్కోసారి రెండు కన్నులకూ వేరుగా ఉంటుంది. దాన్ని బట్టి, స్త్రీ పురుషుల్లో ఎవరు డామినేటింగో చెప్పవచ్చట. ఆడవారి కుడి కనుబొమ కనుక ఎడమ కనుబొమకంటే పైకి ఉంటే... వారిలో ఆధిక్యధోరణి ఎక్కువట. అదే పురుషుల్లో అయితే ఎడమ కనుబొమను పరిగణనలోకి తీసుకోవాలట.గుబురు కనుబొమలు కల మహిళల నడక, బాడీ లాంగ్వేజ్‌లో కొద్దిగా పురుష లక్షణాలు కనిపిస్తుంటాయట. అదే పురుషులైతే యమా ఉత్సాహంగా ఉంటారట.

 

 

Advertisement
 
Advertisement
Advertisement