breaking news
Eyebrow
-
ఐబ్రోస్ చేయించుకుంటున్నారా?.. ఇది మీకోసమే.. కాలేయంపై ఎఫెక్ట్?
బ్యూటీ పార్లర్‌కి వెళ్లి ఐబ్రోస్‌ని అందంగా తీర్చిదిద్దుకోవడం అనేది చాలామంది మహిళలు చేయించుకునే సాధారణ సౌందర్య చికిత్స. దీన్ని రెండు నెలలకొకసారి చేయించుకుంటుంటారు. తక్కువ ఖర్చులో ముఖాన్ని అందంగా మార్చుకునే కొద్దిపాటి సౌందర్య ప్రక్రియ ఇది. దీంతో ఆరోగ్య సమస్యలు ఏం ఉంటాయని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఇంది ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుందని చెబుతున్నారు వైద్యులు. అసలు ఐబ్రోస్ థ్రెడింగ్‌తో ఎలా అనారోగ్యానికి గురవ్వుతారు అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈ వ్యాధి సంక్రమణం, కాస్మెటిక్ విధానాల వల్ల కూడా ఇది సోకుతుందా వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.!.ఇటీవల ఓ 28 ఏళ్ల మహిళ ఇలాంటి సమస్యను ఎదుర్కొవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెన కనుబొమ్మలు థ్రెడింగ్ చేయించుకున్న తర్వాత కాలేయ ఇన్ఫెక్షన్కి సంబంధించిన హెపటైటిస్ బీ బారిన పడిందని వైద్య పరీక్షల్లో తేలింది. శతాబ్దాల నాటి బ్యూటీషియన్ విధానం ఇది. పైగా ప్రతి రెండు నెలలకోసారి చేయించుకుంటుంటారు. చాలా సరసమైన ధరలో ముఖాకృతి అందంగా మార్చుకుని ఈ సౌందర్య చికిత్స సదరు మహిళకు ప్రాణంతకంగా మారిందని వెల్లడించారు వైద్యులు. ఆ యువతికి థ్రెడింగ్ ద్వారా హెపటైటిస్ బి వ్యాపించిందని చెప్పుకొచ్చారు. ఆమె ఆ ఐబ్రోస్ షేప్ చేయించుకున్న తదనంతరం..అలసట, వికారం, పసుపు కళ్లు వంటి సమస్యలను ఎదుర్కొంది. ఈ థ్రెడ్డింగ్ కారణంగా ఆమె శరీరంలోకి హెపటైటిస్ బి లేదా సి వైరస్లు రక్తప్రవాహంలోకి ప్రవేశించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Dr. Aditij Dhamija | Health Educator | MBBS (@drdhamija)అసలు హెపటైటిస్‌కు ఎలా దారితీస్తుంది...కొన్ని పార్లర్లలో కనుబొమ్మల ఆకృతి కోసం చేసే థ్రెడింగ్ దారం సాధారణంగా అందరికి ఉపయోగించే దాన్నే వినియోగిస్తుంటారు. అక్కడ వాళ్లు కాస్త పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని అన్నారు. ఒకరికి ఉపయోగించని దారం మరొకరికి వినియోగించడంతో ఆ థ్రెడ్డ్ కనుబొమ్మలను కట్ చేస్తున్నప్పుడే ఈ హెపటైటిస్ బి, సీ వైరస్లు సులభంగా సక్రమింస్తాయట. ఒక్కోసారి దీని వల్లే హెచ్ఐవీ బారీన కూడా పడే ప్రమాదం ఉందట.డబ్ల్యూహెచ్ఓ సైతం..ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం టాటూ వేయించుకోవడం, రేజర్లను షేర్ చేసుకోవడం, థ్రెడింగ్ చేయించుకోవడం వంటి కాస్మెటిక్ విధానాల వల్ల హెపటైటిస్ బి బారినపడ్డ పలు కేసులు ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. ఈ హెపటైటిస్ బి వైరస్ చిన్న కలుషితమైన వాటి ఉపరితలాలపై రోజుల తరబడి జీవించి ఉంటుందట. ఇది కేవలం రక్తం వల్ల సంక్రమించదని, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న ఒక్క దారం చాలు సులభంగా ఈ వ్యాధి సంక్రమిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎంత వ్యవధి పడుతుందంటే..వ్యాధి నిరోధక శక్తి బాగున్నంత వరకు ఈ వైరస్‌తో ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే అనారోగ్యానికి గురవ్వడం లేదా వీక్ అవుతామో అప్పుడు ఈ వైరస్ విజృంభణ మొదలవ్వుతుందట. తీవ్రమైన హెపటైటిస్ బి ఆరునెలల వరకు ఉంటుందట. ఈ టైంలో వైరస్ శరీరమంతా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఒక్కోసారి క్రియాశీల హెపటైటిస్ బారిన పడితే..సుదీర్ఘకాలం ఈ సమస్యతో బాధపడాల్సిందేనని చెబుతున్నారు నిపుణులు. ఇందులోనే సాధారణ హెపటైటిస్ బారిన పడితే..ప్రమాదం తక్కువగా ఉంటుంది. వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడగలరని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..ఒక్కోసారి ఈ హెపటైటిస్ బి అనేది ఎలాంటి సంకేతాలు చూపకుండానే దాడి చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా చాలామటుకు అందరిలోనూ ఒకేలా ఈ కింది సంకేతాలు కనిపిస్తాయి..కడుపు నొప్పిఅలసటజ్వరంకీళ్ల నొప్పులుఆకలి లేకపోవడంవికారం, వాంతులుముదురు రంగు మూత్రంలేత లేదా మట్టి రంగు మలంచేతులు, కాళ్లు వాచినట్లు లేదా ఉబ్బినట్లుగా నీరి చేరి ఉండటంచర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం తదితర లక్షణాలుఅందువల్ల సాధ్యమైనంత వరకు కాస్మెటిక్కి సంబంధించిన వాటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. పార్లర్లో సరైన పరి శుభ్రత ఉందో లేదో నిర్థారించుకున్నాక..ఎలాంటి సౌందర్య చికిత్సా విధానానికైనా ముందుకెళ్లడం మంచిది అని సూచిస్తున్నారు నిపుణులుగమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!) -
అందమైన కనుబొమ్మలకు కలోంజీ!
నల్ల జీలకర్ర (కలోంజీ) విత్తనాలను పొడిచేయాలి. ఈ పొడిలో ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్‌ను వేసి చక్కగా కలపాలి. ఇప్పుడు తడి కాటన్ వస్త్రంతో కనుబొమ్మలను శుభ్రంగా తుడిచి.. నల్ల జీలకర్ర మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. కనుబొమ్మలను తడిలేకుండా తుడిచి కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను కనుబొమ్మలపైన రాసి ఐదునిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగి కనుబొమల మీద వెంట్రుకలు పెరుగుతాయి. నల్లజీలకర్ర ప్యాక్ పలుచటి కనుబొమలను ఒత్తుగా మారుస్తుంది. కనుబొమలు తీరైన ఆకృతిలో చక్కగా మెరుస్తాయి. కలోంజిలోని ΄ోషకాలు కనుబొమల వెంట్రుకలు రాలకుండా చేస్తాయి. కనుబొమలు తెల్లబడడం మొదలైన వారు సైతం ఈ ΄్యాక్‌ను వాడితే వెంట్రుకలు నల్లగా మారతాయి. (చదవండి: తవ్వకాల్లో బయటపడిన రెండు వేల ఏళ్ల నాటి బ్యూటీ పార్లర్!) -
రోజూ ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి
కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పలుచని కనుబొమ్మలను ఒత్తుగా... నల్లగా మార్చుకోవడానికి ఇలా ప్రయత్నించి చూడండి... ఆముదం: జట్టు పెరుగుదలకు దోహదపడే వాటిలో ఆముదం ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దూదిని ఆముదంలో ముంచి పలుచని ఐబ్రోస్ మీద అద్దుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ కనుబొమలకు రాసుకోవాలి. రెండు మూడు వారాల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్ : ఫీనాలిక్ కాంపౌండ్స్ ఉండే ఆలివ్ నూనెను కనుబొమ్మలకు రాస్తే .. వెంట్రుకలు నల్లగా పెరుగుతాయి. -
కనుబొమలకు ఆముదం
కనుబొమ్మలు సరైన ఆకృతిలోనే కాదు దళసరిగా ఉండేలా షేప్ చేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. బాలీవుడ్– టాలీవుడ్ అనే తేడా లేకుండా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. కొంతమందికి కనుబొమలు ఒత్తుగా ఉంటాయి. లేదంటే ఖరీదైన కనుబొమ్మల కిట్‌ను కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తారు. అలా చేయలేని వారు కూడా కనుబొమలు ఒత్తుగా పెరిగేలా ఇంట్లోనే ఒక సీరమ్‌ను తయారుచేసుకొని వాడుకోవచ్చు. ►2 టేబుల్ స్పూన్ల ఆముదం ►టీ స్పూన్ కొబ్బరి నూనె ►3–4 చుక్కల లావెండర్ ఆయిల్. ►చిన్న బాటిల్లో ఆముదం, కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి ►మస్కారా బ్రష్‌తో ఆ ఆయిల్‌ను అద్దుకుంటూ కనురెప్పలకు ఉపయోగించాలి ►టూత్‌పిక్‌తో ఆయిల్‌ను అద్దుకుంటూ జాగ్రత్తగా కనుబొమ్మల వెంట్రుకలకు వాడాలి. ఈ ఆయిల్‌ను రోజుకు రెండు సార్లు వాడుకోవచ్చు. ఆముదంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, కొబ్బరినూనె, లావెండర్ ఆయిల్‌లోని విటమిన్లు, ప్రొటీన్లు వెంట్రుకల వృద్ధికి తోడ్పడతాయి. -
హరివిల్లులా ఉంటే వారు వీరవుతారు!
కనుబొమలు ప్రముఖ ఫెంగ్షు నిపుణురాలు ప్రియా షేర్ ‘కనుబొమలు- మనుషుల మనస్తత్వాలు’ అనే విషయంపై చాలాకాలంగా పరిశోధన చేస్తున్నారు. కనుబొమల్ని బట్టి మనిషి స్వభావాన్ని అంచనా వెయ్యొచ్చని గతంలో ఆమె ఆసక్తికరమైన కొన్ని విషయాలను వెల్లడించారు. ఇప్పడు వాటికి మరిన్ని విశేషాలు జోడించారు. అద్దంలో మీ కను బొమల్ని చూసుకోండి. మీరేమిటో తెలుసుకోండి. ఇంద్రధనుసులా వంగివుండే కనుబొమలు కల పురుషులు సెన్సెటివ్‌గా... మహిళలైతే మొండిగా ఉంటారట. సన్నని గీతలా ఉండే కనుబొమలు కలవారు చాలా మృదు స్వభావులై ఉంటారట. చివర్లు వంపు తిరిగి ఉండే కనుబొమలు కలవారు సృజనాత్మకత కలవారై ఉంటారట. కనుబొమలు నల్లగా కాకుండా బ్రౌన్ కలర్లో ఉంటే... వారిలో ప్రణయ భావనలు అధికంగా ఉంటాయట. అదే కనుబొమలు మెత్తగా లేకుండా రఫ్‌గా ఉంటే... అటువంటి భావనలు తక్కువగా ఉంటాయట. తిన్నగా గీత గీసినట్టుగా ఉండే కనుబొమలు ఉన్నవారు దృఢచిత్తం కలవారై ఉంటారట. ఒకవేళ మహిళలైతే వారిలో కాస్త పురుషత్వం కనిపిస్తూ ఉంటుందట. కన్నులకు మరీ దూరంగా, పైన ఎక్కడో ఉన్నట్టుగా కనుబొమలు ఉంటే... వారికి కలలు, కోరికలు ఎక్కువుంటాయట. అదే కనుబొమలు కన్నులకు చాలా దగ్గరగా ఉంటే... వారిలో నిబద్ధత, ప్రతి పని పట్ల శ్రద్ధ కనిపిస్తుందట. అలాగే వీరు పరమ జాగ్రత్తపరులట. కొన్నిసార్లు తమ పనిలో పడి ఇతరులను కూడా పట్టించుకోరట. కంటికీ కనుబొమకీ మధ్య ఉండే దూరం ఒక్కోసారి రెండు కన్నులకూ వేరుగా ఉంటుంది. దాన్ని బట్టి, స్త్రీ పురుషుల్లో ఎవరు డామినేటింగో చెప్పవచ్చట. ఆడవారి కుడి కనుబొమ కనుక ఎడమ కనుబొమకంటే పైకి ఉంటే... వారిలో ఆధిక్యధోరణి ఎక్కువట. అదే పురుషుల్లో అయితే ఎడమ కనుబొమను పరిగణనలోకి తీసుకోవాలట.గుబురు కనుబొమలు కల మహిళల నడక, బాడీ లాంగ్వేజ్‌లో కొద్దిగా పురుష లక్షణాలు కనిపిస్తుంటాయట. అదే పురుషులైతే యమా ఉత్సాహంగా ఉంటారట. -
కనుబొమలు క్యారెక్టర్ని చెప్తాయా?!
మనిషిని చూడగానే వారి మనస్తత్వం తెలిసిపోతుందా? తెలియదనే అంటారు ఎవరైనా. కానీ ప్రముఖ ఫెంగ్షు నిపుణురాలు ప్రియా షేర్ మాత్రం తనకు తెలుస్తుంది అంటోంది. మీరు కూడా తెలుసుకోవచ్చు అని చెబుతోంది. కనుబొమలు మనిషి మనసుకు అద్దం పడతాయట. కాబట్టి వాటిని చూసి ఎవరేంటో తెలుసుకోండి అంటోంది. అదెలాగంటే... చివర్లు వంపు తిరిగి ఉండే కనుబొమలు కలవారు సృజనాత్మకత కలవారై ఉంటారట తిన్నగా గీత గీసినట్టుగా ఉండే కనుబొమలు ఉన్నవారు దృఢచిత్తం కలవారై ఉంటారట. ఒకవేళ మహిళలైతే వారిలో కాస్త పురుషత్వం కనిపిస్తూ ఉంటుందట ఇంద్రధనుసులా వంగివుండే కనుబొమలు కల పురుషులు సెన్సెటివ్‌గా... మహిళలైతే మొండిగా ఉంటారట గుబురు కనుబొమలు కల మహిళల నడక, బాడీ లాంగ్వేజ్‌లో కొద్దిగా పురుష లక్షణాలు కనిపిస్తుంటాయట. అదే పురుషులైతే యమా ఉత్సాహంగా ఉంటారట సన్నని గీతలా ఉండే కనుబొమలు కలవారు చాలా మృదుస్వభావులై ఉంటారట కన్నులకు మరీ దూరంగా, పైన ఎక్కడో ఉన్నట్టుగా కనుబొమలు ఉంటే... వారికి కలలు, కోరికలు ఎక్కువుంటాయట. అదే కనుబొమలు కన్నులకు చాలా దగ్గరగా ఉంటే... వారిలో నిబద్ధత, ప్రతి పని పట్ల శ్రద్ధ కనిపిస్తుందట. అలాగే వీరు పరమ జాగ్రత్తపరులట. కొన్నిసార్లు తమ పనిలో పడి ఇతరులను కూడా పట్టించుకోరట కనుబొమలు నల్లగా కాకుండా బ్రౌన్ కలర్లో ఉంటే... వారిలో శృంగార భావనలు అధికంగా ఉంటాయట. అదే కనుబొమలు మెత్తగా లేకుండా రఫ్‌గా ఉంటే... అటువంటి భావనలు తక్కువగా ఉంటాయట కంటికీ కనుబొమకీ మధ్య ఉండే దూరం ఒక్కోసారి రెండు కన్నులకూ వేరుగా ఉంటుంది. దాన్ని బట్టి, స్త్రీ పురుషుల్లో ఎవరు డామినేటింగో చెప్పవచ్చట. ఆడవారి కుడి కనుబొమ కనుక ఎడమ కనుబొమకంటే పైకి ఉంటే... వారిలో ఆధిక్యధోరణి ఎక్కువట. అదే పురుషుల్లో అయితే ఎడమ కనుబొమను పరిగణనలోకి తీసుకోవాలట.అదీ కనుబొమల కథ. ఇంకెందుకు లేటు?! ఎవరి గురించి తెలుసుకోవాలన్నా ఈసారి ఈ థియరీని ఫాలో అయ్యి చూడండి.