కనుబొమలకు ఆముదం

If Your Eyebrows Are Growing Well Add Coconut Oil - Sakshi

బ్యూటిప్స్‌

కనుబొమ్మలు సరైన ఆకృతిలోనే కాదు దళసరిగా ఉండేలా షేప్‌ చేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. బాలీవుడ్‌– టాలీవుడ్‌ అనే తేడా లేకుండా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. కొంతమందికి కనుబొమలు ఒత్తుగా ఉంటాయి. లేదంటే ఖరీదైన కనుబొమ్మల కిట్‌ను కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తారు. అలా చేయలేని వారు కూడా కనుబొమలు ఒత్తుగా పెరిగేలా ఇంట్లోనే ఒక సీరమ్‌ను తయారుచేసుకొని వాడుకోవచ్చు.

►2 టేబుల్‌ స్పూన్ల ఆముదం
►టీ స్పూన్‌ కొబ్బరి నూనె
►3–4 చుక్కల లావెండర్‌ ఆయిల్‌.
►చిన్న బాటిల్‌లో ఆముదం, కొబ్బరినూనె, లావెండర్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి
►మస్కారా బ్రష్‌తో ఆ ఆయిల్‌ను అద్దుకుంటూ కనురెప్పలకు ఉపయోగించాలి
►టూత్‌పిక్‌తో ఆయిల్‌ను అద్దుకుంటూ జాగ్రత్తగా కనుబొమ్మల వెంట్రుకలకు వాడాలి. ఈ ఆయిల్‌ను రోజుకు రెండు సార్లు వాడుకోవచ్చు. ఆముదంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, కొబ్బరినూనె, లావెండర్‌ ఆయిల్‌లోని విటమిన్లు, ప్రొటీన్లు వెంట్రుకల వృద్ధికి తోడ్పడతాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top