
వారానికి 72 గంటల పని వాదనలు సద్దుమణిగాయి అనుకునేలోపే.. మళ్లీ ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఏఐ స్టార్టప్ మెర్కోర్‌లో పనిచేస్తున్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. వారానికి 72 నుంచి100 గంటలు పనిచేసిన తన అనుభవాన్ని పంచుకున్న తర్వాత ఇది చర్చకు దారితీసింది.
మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ప్రణవ్ మెహతా.. అన్ని కాలాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని అభివర్ణిస్తూ, వారానికి 72 గంటల పని అంటే మొదట్లో కొంత భయంగా అనిపించవచ్చు. అప్పుడప్పుడు ఇది 100 గంటలకు కూడా విస్తరిస్తుందని పేర్కొన్నాడు. వారానికి 40 గంటల పని, అనుకున్న లాభాలను అందించదని అన్నారు. మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ చేసిన పోస్ట్‌కు ప్రతిస్పందనగా మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు.
మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ.. కంపెనీ ఆదాయం 17 నెలల్లోనే 1 నుంచి 500 మిలియన్లకు పెరిగింది. దీనిని ఎప్పటికప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని పేర్కొన్నాడు. కంపెనీ ఇప్పుడు 10 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
వారానికి 72 గంటల పనిపై ప్రణవ్ మెహతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకతకు దారితీశాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు అధిక పని గంటలను కీర్తించడాన్ని విమర్శించారు. ఇంత ఎక్కువ గంటలు పనిచేయడం వెనుక ఉన్న మనస్తత్వాన్ని ఒకరు ప్రశ్నించగా.. ఎక్కువ పనిగంటలు వల్ల తలెత్తే ఇబ్బందులను గురించి పట్టించుకోరా, మీ ఉద్దేశం ఏమిటి? అని మరొకరు అన్నారు.
Fastest growing company of all time.
The 72-hour work week might sound daunting at first (occasionally stretches to 100)
But the growth, the learning curve, the pace- is truly unmatched.
A comfy 40-hour week won't offer the same upside. Not the same energy, not the same… https://t.co/m3K4xTWVBn— Pranav Mehta (@i_pranavmehta) September 15, 2025