సోలార్‌ స్ప్రేయర్‌ ఆవిష్కర్త సుభానీకి ఐసిఏఆర్‌ అవార్డు

Solar sprayer inventor Subhani receives ICAR award - Sakshi

ఆరుతడి పంటలు పండించే రైతుల కోసం కొన్ని సంవత్సరాలుగా అనేక వినూత్న స్రేయర్లను ఆవిష్కరించిన సయ్యద్‌ సుభానీ కృషికి గుర్తింపు లభించింది. భారతీయ వ్యవసాయ పరిశోధాన మండలి సుభానీని జాతీయ ఉత్తమ ఆవిష్కర్త అవార్డుకు ఎంపిక చేసింది. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌)లో జరగనున్న జాతీయ ఉద్యాన ప్రదర్శన–2020లో ఈనెల 8న సుభానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. 

కషాయాలు, పురుగుమందులను త్వరితగతిన పిచికారీ చేసే సౌర విద్యుత్తుతో నడిచే ఆటోమేటిక్‌ సోలార్‌ మౌంటెడ్‌ మల్టీ క్రాప్‌ స్ప్రేయర్‌ను రూపొందించినందుకు ప్రధానంగా ఈ అవార్డు తనకు దక్కిందని సయ్యద్‌ సుభానీ తెలిపారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని నాగబైరు పాలెం. సుభానీ(98486 13687) గతంలో రూపొందించిన బూమ్‌ స్ప్రేయర్‌ బాగా ప్రాచుర్యం పొందింది. సుభానీ కృషికి ‘సాక్షి సాగుబడి’ జేజేలు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top