చిన్నపర్స్...ఖరీదు ఘనం! | Small purse ... the cost of the cube! | Sakshi
Sakshi News home page

చిన్నపర్స్...ఖరీదు ఘనం!

Aug 27 2014 10:45 PM | Updated on May 24 2018 2:36 PM

చిన్నపర్స్...ఖరీదు ఘనం! - Sakshi

చిన్నపర్స్...ఖరీదు ఘనం!

అమ్మాయిలకు ప్రియనేస్తం హ్యాండ్ బ్యాగ్. చిన్న హ్యాండ్‌బ్యాగ్ నుంచి క్లచ్‌గా మారిన ఈ రూపానికి ఎన్నో మెరుగుల అద్దారు డిజైనర్లు.

విలాసం
 
అమ్మాయిలకు ప్రియనేస్తం హ్యాండ్ బ్యాగ్. చిన్న హ్యాండ్‌బ్యాగ్ నుంచి క్లచ్‌గా మారిన ఈ రూపానికి ఎన్నో మెరుగుల అద్దారు డిజైనర్లు. అతివల ముంజేతిలో అందంగా మెరిసిపోయే క్లచ్‌లెన్నో చూస్తుంటాం. ఇప్పటి వరకు ఖరీదైన క్లచ్‌లెన్నో కొనుగోలు చేసి ఉంటారు. కానీ, బ్రిటన్ ఆభరణాల నిపుణులు క్రిస్టోఫర్ షెలిస్ తయారు చేసిన క్లచ్‌ను కొనుక్కోవాలంటే మాత్రం అక్షరాలా కోటీ పది లక్షల రూపాయలు చెల్లించాలి.

బార్గేజీ బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఈ రాయల్ క్లచ్ తయారీకి 100 పనిగంటల సమయం పట్టిందట. వెయ్యేళ్ల గ్యారెంటీ గల ఈ క్లచ్ లండన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్ గేట్‌ను పోలిన డిజైన్ ఉంటుంది. ఈ ఏడాది అత్యంత ఖరీదైనదిగా పేరొందిన ఈ క్లచ్ తయారీలో 18 క్యారెట్ల బంగారం, 345 వజ్రాలతో రూపుదిద్దారు. అయితే 2010లో మొవాద్ కంపెనీ 1001 వజ్రాలతో రూపొందించిన చిన్న పర్స్ నేటికీ అత్యంత ఖరీదైన పర్స్‌ల జాబితాలో ముందుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement