జలుబును తగ్గించే నిమ్మ! | Slime to reduce cold | Sakshi
Sakshi News home page

జలుబును తగ్గించే నిమ్మ!

Jul 2 2017 10:55 PM | Updated on Sep 5 2017 3:02 PM

జలుబును తగ్గించే నిమ్మ!

జలుబును తగ్గించే నిమ్మ!

నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందని అనుకుంటారు. కానీ నిమ్మలో విటమిన్‌–సి సమృద్ధిగా ఉంటుంది.

గుడ్‌ఫుడ్‌

నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందని అనుకుంటారు. కానీ నిమ్మలో విటమిన్‌–సి సమృద్ధిగా ఉంటుంది. అందుకే నిమ్మరసం రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి జలుబు తగ్గుతుంది. నిమ్మలో ఉన్న పోషకాలివి. నిమ్మలో ఉండే విటమిన్‌–సి చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. నిమ్మను తరచూ వాడేవారికి క్యాన్సర్‌నుంచి స్వాభావికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది.  నిమ్మలో ఎండార్ఫిన్‌ అనే రసాయనాలు ఎక్కువ. అందుకే నిమ్మ నీరు లేదా నిమ్మ షర్బత్‌ తాగిన తర్వాత ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఉంటుంది.

ఈ ఎండార్ఫిన్‌ రసాయనాల్లో యాంగై్జటీ తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి లేదా యాంగై్జటీ కలిగినప్పుడు నిమ్మరసం ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.అర లీటరు నీళ్లలో ఒక నిమ్మపండు రసాన్ని పిండి అందులో చిటికెడంత ఉప్పు, చారెడు పంచదార వేసి తాగితే అది డీ–హైడ్రేషన్‌ ప్రమాదం నుంచి కాపాడుతుంది. నిమ్మలోని వ్యాధి నిరోధకతను కలిగించే పోషకాల వల్ల అది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement