చరణ్‌ అంకుల్‌.. ఉప్సీ ఆంటీ..!! | Sitara wishes to upasana | Sakshi
Sakshi News home page

చరణ్‌ అంకుల్‌.. ఉప్సీ ఆంటీ..!!

Jul 22 2018 12:14 AM | Updated on Jul 22 2018 12:14 AM

Sitara wishes to upasana - Sakshi

‘థ్యాంక్యూ చరణ్‌ అంకుల్‌ అన్డ్‌ ఉప్సీ ఆంటీ ఫర్‌ ది లిటిల్‌ బర్డ్స్‌! దే ఆర్‌ సో క్యూట్‌. హ్యాపీ బర్త్‌డే ఉప్సీ ఆంటీ!’. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారాల కూతురు సితార ముద్దుముద్దుగా పలికిన మాటలివి. జూలై 20న సితార పుట్టినరోజు. మొన్న తన ఆరవ పుట్టినరోజు జరుపుకున్న సితారకు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన చిన్న చిన్న పక్షులను బహుమతులుగా పంపించారట.

వాళ్లకు థ్యాంక్స్‌ చెబుతూ సితార ఒక వీడియో చేసింది. ఆ వీడియోను మహేశ్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. సితారకు చాలా చిన్నప్పట్నుంచే సోషల్‌ మీడియాలో బాగా ఫాలోయింగ్‌ ఉంది. సితార పుట్టినరోజు వచ్చిందంటే, మహేశ్‌ పుట్టినరోజు వచ్చినట్టుగానే ట్విట్టర్‌లో బర్త్‌డే ట్రెండ్‌ నడుస్తుంది. అలాగే ఈసారి కూడా సితార బర్త్‌డే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. ముఖ్యంగా సితార వీడియోకు వేలల్లో రీట్వీట్స్‌ వచ్చాయి.

సితార పుట్టినరోజునే ఉపాసన పుట్టినరోజు కూడా! వీడియో చివర్లో ‘హ్యాపీ బర్త్‌డే ఉప్సీ ఆంటీ!’ అని సితార పలకడం వీడియోకు మరింత క్యూట్‌నెస్‌ తెచ్చిపెట్టింది. మహేశ్, రామ్‌చరణ్‌ల ఫ్రెండ్‌షిప్‌కు అభిమానులు కూడా ముచ్చటపడిపోవడం విశేషంగా చెప్పుకోవాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement