శ్రీయా'కృతులు' | Shriya Bhupal, fashion designerm of shriyasom | Sakshi
Sakshi News home page

శ్రీయా'కృతులు'

Jun 30 2016 10:59 PM | Updated on Sep 4 2017 3:49 AM

శ్రీయా'కృతులు'

శ్రీయా'కృతులు'

ఇవిగో శ్రీయాకృతులు... ఆకృతులలో శ్రీయ రాగాలు! మన తెలుగమ్మాయి సృష్టిస్తున్న కళాకృతులు!!

ఇవిగో శ్రీయాకృతులు... ఆకృతులలో శ్రీయ రాగాలు!
 మన తెలుగమ్మాయి సృష్టిస్తున్న కళాకృతులు!!
 శ్రీయా భూపాల్-అఖిల్ అక్కినేని మంచి స్నేహితులని,  
 ఆ స్నేహం పండి ప్రేమ అయ్యిందని వార్తలు బట్టలు చింపుకొని మరీ కేకలు పెడుతున్నాయి.
 కానీ, అంతకు ముందు.. ఎంతో ముందు బట్టల కట్టుతో శ్రీయాకృతులు
 అందరినీ ఆ...కట్టుకుంటూనే ఉన్నాయి.
 
హైదరాబాద్ డిజైనర్
శ్రీయా భూపాల్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2016లో ‘శ్రీయసోమ్’ లేబుల్ కలెక్షన్ ప్రదర్శనలో భాగంగా మోడల్‌తో!
 
నా ఔట్‌ఫిట్స్ వేసుకున్నవారు అచ్చు బార్బీ బొమ్మల్లా కనిపిస్తారు. నా స్కూల్ ఏజ్‌లో ఐదు బార్బీ డాల్స్ కొన్నాను. వాటికి రకరకాల అందమైన డ్రెస్సులు డిజైన్ చేసి, వేసి మురిసిపోయేదాన్ని. అలా ఈ కళ ఎప్పటికప్పుడు కొత్త సృజనకు తావిస్తూ వచ్చింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో అనుకోకుండా అడుగుపెట్టాను. ఆ తర్వాత అదే నా ప్యాషన్ అయ్యింది. నా మొట్టమొదటి అధికారిక ఫ్యాషన్ షో ఈ ఏడాది లాక్మె ఫ్యాషన్ వీక్ సమ్మర్‌లో ప్రదర్శించే అవకాశం దక్కింది. ఈ షో నా జీవితాన్నే మార్చేసింది. జీవితాన్ని పువ్వుల భరితంగా మార్చేసే ఈ దుస్తులు మహిళను ప్రత్యేకంగా చూపుతాయి. ఎప్పటికప్పుడు నా గత డిజైన్స్ నుంచి మరింత మెరుగైన డిజైన్స్ సృష్టించడంపై దృష్టి పెడుతుంటాను.
 - శ్రీయాభూపాల్, ఫ్యాషన్ డిజైనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement