సీన్‌ నంబర్‌ 37... టేక్‌ వన్‌! | seerat kapoor in rajugari gadhi-2 movie | Sakshi
Sakshi News home page

సీన్‌ నంబర్‌ 37... టేక్‌ వన్‌!

Jul 16 2017 12:16 AM | Updated on Jul 15 2019 9:21 PM

సీన్‌ నంబర్‌ 37... టేక్‌ వన్‌! - Sakshi

సీన్‌ నంబర్‌ 37... టేక్‌ వన్‌!

...అసిస్టెంట్‌ డైరెక్టర్‌ క్లాప్‌ కొట్టేసి పక్కకు తప్పుకున్నాడు. సినిమాటోగ్రాఫర్‌ దివాకరన్‌ మెల్లగా కెమెరాను జూమ్‌ చేస్తున్నారు. ఓ పక్క సముద్రం...

...అసిస్టెంట్‌ డైరెక్టర్‌ క్లాప్‌ కొట్టేసి పక్కకు తప్పుకున్నాడు. సినిమాటోగ్రాఫర్‌ దివాకరన్‌ మెల్లగా కెమెరాను జూమ్‌ చేస్తున్నారు. ఓ పక్క సముద్రం... మరోపక్క సముద్రపు గాలులకు మెల్లగా ఊగుతోన్న చెట్లు... కెమెరాను ఇంకొంచెం జూమ్‌ చేస్తే ఓ రిసార్ట్‌ సగం వరకు కనిపిస్తోంది. అక్కడ కమెడియన్స్‌ ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్‌ ఏవో డైలాగులు చెప్పారు. వెంటనే ‘షాట్‌ ఓకే’ అంటూ మైక్‌లో దర్శకుడు ఓంకార్‌ వాయిస్‌. కింగ్‌ నాగార్జున హీరోగా ఓంకార్‌ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ‘రాజుగారి గది–2’లో సీన్‌ నంబర్‌ 37లో ఓ షాట్‌ ఇది.

పాండిచ్చేరిలో ఈ సీన్‌ తీశారు. సేమ్‌ సీన్‌లో నాగార్జున, హీరోయిన్లలో ఒకరైన సీరత్‌ కపూర్‌ కూడా ఉన్నారు. మరి, వాళ్ల గురించి చెప్పలేదేంటి? అనుకుంటున్నారా! వాళ్లు నెక్స్ట్ షాట్స్‌లో వస్తారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోన్న ‘రాజుగారి గది–2’లో అవే షాట్స్‌ తీస్తున్నారని సమాచారం. కిశోర్, ప్రవీణ్‌లు డైలాగులు చెప్పిన తర్వాత సడన్‌గా నాగార్జున ప్రత్యక్షమయ్యే సరికి వీళ్లు భయపడతారట! ఆ తర్వాత ఏం జరిగిందనేది సిల్వర్‌ స్క్రీన్‌ మీద చూడాల్సిందే. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో సమంత, కాజల్, అశ్విన్‌బాబు తదితరులు నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement