అటుకుల పాయసం | sakshi food special | Sakshi
Sakshi News home page

అటుకుల పాయసం

Dec 18 2016 11:17 PM | Updated on Sep 4 2017 11:03 PM

అటుకుల పాయసం

అటుకుల పాయసం

ముందుగా అటుకుల్ని కడిగి నీళ్లు లేకుండా పిండి పది నిమిషాల సేపు ఆరబెట్టాలి.

క్విక్‌ ఫుడ్‌

కావలసినవి : మీగడ పాలు – ఒక లీటరు; అటుకులు – 100 గ్రా; పంచదార –    1/4 కిలో; ఏలకులు  – 4 (పొడి చేయాలి); జీడిపప్పు  – 4 టేబుల్‌ స్పూన్లు; కిస్‌మిస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; నెయ్యి  – 2 టేబుల్‌ స్పూన్లు
తయారి :
ముందుగా అటుకుల్ని కడిగి నీళ్లు లేకుండా పిండి పది నిమిషాల సేపు ఆరబెట్టాలి.
మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించాలి.
  అందులో అటుకులు వేసి తక్కువ మంట మీద కాసేపు ఉడకనివ్వాలి.
తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి పాలు సగమయ్యే వరకు ఉడికించి దించాలి.
  బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి పాయసంలో కలపాలి.
  దీనిని వేడిగా తినవచ్చు, చల్లగా కూడా బావుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement