ఫైబర్‌ రైస్‌తో షుగర్‌ వ్యాధికి చెక్‌!

Replacing White Rice With High Fiber Rice Reduces Blood Sugar - Sakshi

న్యూఢిల్లీ: పాలిష్‌ చేసిన బియ్యం (వైట్‌ రైస్‌)కి స్వస్తిచెప్పి.. పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్‌ తీసుకుంటే మధుమేహం, బ్లడ్‌ షుగర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడవచ్చని మద్రాస్‌ డయాబెటిస్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. వైట్‌ రైస్‌ వాడకం వలన టైప్‌–2 మధుమేహం వస్తుంది. ఆపై కళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫైబర్‌ ఎక్కువగా లభించే పదార్థాలు ఆహారంగా తీసుకుంటే బ్లడ్‌ షుగర్‌ స్థాయి అదుపులో ఉంటాయి. అందుకే వైట్‌ రైస్‌ స్థానంలో హై ఫైబర్‌ రైస్‌ను తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అధిక బరువు సమస్యకూ ఇది చక్కని పరిష్కారమని వివరించారు.

నిద్రలేమి, పని ఒత్తిడితో హై బీపీ!
మ్యూనిచ్‌: నిద్రలేమి, పని ఒత్తిడి అనేవి హైపర్‌ టెన్షన్‌కు కారణమవుతున్నాయని జర్మనీలోని మ్యూనిచ్‌ టెక్నికల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని వారు వెల్లడించారు. అలాంటి వారికి గుండె జబ్బులు సంభవించే అవకాశం ఎక్కువని తెలిపారు. అధ్యయనంలో భాగంగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న 2 వేల మంది బీపీ రోగులను పరిశీలించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top