మునగ చెట్టు ఎక్కండి

Powerful Munakkada Produces Better Results In Beauty Nutrition - Sakshi

బ్యూటిప్స్‌

►మునక్కాడలతో రుచికరమైన వంటకాలు చేసుకుంటాం. అలాగే మనగ ఆకులు, గింజల్లోనూ పోషకాలు ఉన్నాయి. ఈ శక్తివంతమైన మునగ సౌందర్య పోషణ లో మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మునగ ఆకు పొడి ముఖచర్మం ముడతలు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. యవ్వనకాంతిని తీసుకురావడంలో సహాయపడతుంది. మునగ ఆకు పొడిలో రోజ్‌వాటర్‌ కలిపి నల్ల మచ్చలు, యాక్నె అయిన చోట రాయాలి. ఆరిన తర్వాత శుభ్రపరచాలి. మచ్చలు, మొటిమలు, యాక్నె సమస్య తగ్గుతుంది.

►అర టీ స్పూన్‌ మునగ ఆకు పొడి, టేబుల్‌ స్పూన్‌ తేనె, రోజ్‌ వాటర్‌ సగం టేబుల్‌ స్పూన్, తగినన్ని నీళ్లు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, పది నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. శుభ్రమైన టవల్‌తో తుడిచి, కొద్దిగా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. దీని వల్ల చర్మం మృదుత్వం, కాంతిమంతం అవుతుంది.

►కప్పు కొబ్బరి పాలు, టేబుల్‌ స్పూన్‌ మునగ ఆకు పొడి, టీ స్పూన్‌ తేనె తీసుకోవాలి. కొబ్బరి పాలను ఒక గిన్నెలో పోసి సన్నని మంట మీద రెండు నిమిషాలు వేడి చేయాలి. మంట తీసేసి పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ గిన్నెలో మునగ ఆకు, తెనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, షవర్‌ క్యాప్‌ వేయాలి. పది నిమిషాలు వదిలేసి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే శిరోజాలకు తగినంత మాయిశ్చరైజర్‌ అంది జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top