మే 13న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On May 13, the birthday celebrated | Sakshi
Sakshi News home page

మే 13న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

May 13 2015 12:58 AM | Updated on Sep 3 2017 1:54 AM

మే 13న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 13న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు,కొత్త ప్రాజెక్టులు చేపడతారు...

రవిశంకర్ (ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు), సన్నీ లియోని (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారి వ్యక్తిగత సంఖ్య 8. వీరు ఈ సంవత్సరమంతా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. విద్యార్థులకు... ముఖ్యంగా ఎం.బి.ఎ. వంటి కోర్సులు చేసేవారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. మేనేజిమెంట్ రంగంలో గొప్ప ఉద్యోగాలు వరిస్తాయి. తలిదండ్రుల కలల నెరవేరతాయి. ఉద్యోగులకు మంచి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. లక్కీ నంబర్స్: 4,5,6,8, లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, బ్లూ, ఎల్లో; లక్కీ డేస్: ఆది, గురు, శని వారాలు. వృద్ధులకు ముఖ్యంగా అనాథ వృద్ధులకు అన్నదానం చేయడం, అనాథ ప్రేత సంస్కారానికి తోడ్పడటం, శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలుంటాయి.
- రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement
 
Advertisement
Advertisement