ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | on june 08 the birthday celebrated | Sakshi
Sakshi News home page

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 7 2015 11:15 PM | Updated on Sep 3 2017 3:23 AM

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: గిరిబాబు (నటుడు), శిల్పాశెట్టి (నటి)
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు. వారసత్వంగా రావలసిన ఆస్తిపాస్తులు చేతికి అందుతాయి. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వారి ఆశలు నెరవేరతాయి.

కోర్టుకేసుల నుండి విముక్తి లభించడంతోపాటు వివాదాలలో చిక్కుకున్న ఆస్తులను గెలుచుకుంటారు. అయితే రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ సంవత్సరం న్యాయసంబంధమైన, చట్టసంబంధమైన వివాదాలలో ఇరుక్కుంటే వాటినుంచి బయట పడటం అంత సులభం కాదు కాబట్టి గోటితో పోయేదానికి గొడ్డలి దాకా వెళ్లకుండా రాజీ ధోరణితో వ్యవహరించడం మంచిది. మేనేజ్‌మెంట్ రంగంలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు, ఫైనాన్స్ రంగ ంలోని వారికి బాగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ తమ రంగాలలో బాగా పుంజుకుంటారు. లక్కీ నంబర్లు: 4,5,6,8; లక్కీ కలర్స్: పర్పుల్, బ్లూ, వయోలెట్, గ్రీన్; లక్కీ డేస్: శుక్ర, శని, ఆది, సోమ వారాలు. సూచనలు: కోపాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement