రణ్‌బీర్ మోసగాడా? | OMG! Did Katrina Kaif just call Ranbir Kapoor a cheat? | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్ మోసగాడా?

Dec 10 2015 12:28 AM | Updated on Apr 3 2019 7:03 PM

రణ్‌బీర్ మోసగాడా? - Sakshi

రణ్‌బీర్ మోసగాడా?

రణ్‌బీర్‌కపూర్, దీపికా పదుకొనే కలిసి చేసిన ‘తమాషా’ ప్రేక్షకులకు మంచి ఫీల్ కలిగించింది. నిజమైన ప్రేమపక్షుల్లా రెచ్చిపోయి కెమిస్ట్రీ పండించారు.

బాలీవుడ్ బాత్
రణ్‌బీర్‌కపూర్, దీపికా పదుకొనే కలిసి చేసిన ‘తమాషా’ ప్రేక్షకులకు మంచి ఫీల్ కలిగించింది. నిజమైన ప్రేమపక్షుల్లా రెచ్చిపోయి కెమిస్ట్రీ పండించారు. ఒకానొక టైమ్‌లో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట... ఏవో కారణాలతో విడిపోయారు. మళ్లీ కత్రినా కైఫ్‌తో  ప్రేమలో పడ్డాక, రణ్‌బీర్ కొన్నాళ్లు దీపికతో నటించడం మానేశారు. అయితే ఇటీవలే నటించిన ‘తమాషా’తో వాళ్లిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందనే వార్తలు గుప్పుమన్నాయి.

ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఇద్దరూ మునుపటి కన్నా క్లోజ్‌గా మూవ్ కావడం వీరిద్దరి మధ్య అనుబంధం మీద  సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయంపై  రణ్‌బీర్  మీద కత్రినా కైఫ్ బాహాటంగానే ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ‘‘మోసగాళ్లు ఎక్కడైనా, ఎప్పుడైనా మోసగాళ్లే. ఇలాంటివి నేను సహించలేను’’ అని తన కోపాన్ని  ప్రదర్శించారని సమాచారం. మరి వీరిద్దరి బంధం కూడా మూణ్ణాళ్ల ముచ్చటేనా..? అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement