అక్టోబర్ 22 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | October 22 celebration of the birthda of Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 22 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 21 2015 11:14 PM | Updated on Sep 3 2017 11:18 AM

అక్టోబర్  22  పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 22 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు...
పరిణీతి చోప్రా (నటి), కిటూ గిద్వానీ (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు పుట్టిన తేదీ 22. ఇది కూడా రాహు సంఖ్యే. రాహుగ్రహ అనుకూల ప్రభావం వల్ల వీరు ఈ సంవత్సరం సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. కొత్త బంధాలు ఏర్పడి, వాటిని లాభదాయకంగా మార్చుకోగలుగుతారు. అయితే రాహుగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సామరస్య ధోరణి మంచిది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరి, అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తారు. అయితే, ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలించకపోవచ్చు.

ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. రాజకీయనాయకులకు పదవులు వరిస్తాయి. అయితే మితిమీరిన క్రమశిక్షణ పాటించడం వల్ల తోటి ఉద్యోగుల అసహనానికి, విమర్శలకు గురవుతారు.అధికారుల ఆగ్రహానికి కూడా గురై ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు కాబట్టి అతి అనర్థదాయకం అని గ్రహించి, దూకుడు తగ్గించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1, 2, 4,5,6; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, దుర్గాదేవిని ఆరాధించడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం మంచిది. పొట్లకాయకు, చికెన్‌కు దూరంగా ఉండటం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 
 

Advertisement
 
Advertisement
Advertisement