breaking news
Kitu gidvani
-
బాలీవుడ్‌పై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు
40ఏళ్లుగా సినిమా, బుల్లితెర రంగాల్లో రాణిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటి కిటు గిద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. బాలీవుడ్లో స్పష్టమైన నిబంధనలు లేవని.. అది అసలు నిజమైన ఇండస్ట్రీ కాదని వ్యాఖ్యానించారు.‘పదేళ్లు పనిచేసిన నటికి మరో పదేళ్లు హుందాగా జీవించే అవకాశం ఉండాలి. కానీ మన దగ్గర ( బాలీవుడ్లో) అలాంటి పరిస్థితి లేదు. నటీనటులకు ఒకేసారి పారితోషికం చెల్లించి, సినిమాపై ఉన్న అన్ని హక్కులను నిర్మాతలే ఉంచుకుంటారు. వయసు పెరిగిన మహిళలకు ఇండస్ట్రీలో సరైన పాత్రలు రావడంలేదు. టెలివిజన్‌లో 30 ఏళ్లు దాటిన మహిళలను అమ్మమ్మ పాత్రల్లో చూపించడం విచిత్రంగా ఉంది. ముఖంపై వృద్ధాప్యం ఛాయలు లేకపోయినా అలాంటి పాత్రలే ఇస్తున్నారు’ అని అన్నారు.1980,90 కాలంలో బుల్లితెర, సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిటు గిద్వానీ. ‘హోళీ’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం ‘ఎయిర్ హోస్టెస్’, ‘స్వాభిమాన్’, ‘శక్తిమాన్’ వంటి సిరియాల్లో నటించారు. ‘ఫ్యాషన్’, ‘ధోబీ ఘాట్’ ‘జానే తు యా జానే నా’ వంటి చిత్రాల్లోనూ నటించారు. -
అక్టోబర్ 22 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు... పరిణీతి చోప్రా (నటి), కిటూ గిద్వానీ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు పుట్టిన తేదీ 22. ఇది కూడా రాహు సంఖ్యే. రాహుగ్రహ అనుకూల ప్రభావం వల్ల వీరు ఈ సంవత్సరం సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. కొత్త బంధాలు ఏర్పడి, వాటిని లాభదాయకంగా మార్చుకోగలుగుతారు. అయితే రాహుగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సామరస్య ధోరణి మంచిది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరి, అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తారు. అయితే, ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలించకపోవచ్చు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. రాజకీయనాయకులకు పదవులు వరిస్తాయి. అయితే మితిమీరిన క్రమశిక్షణ పాటించడం వల్ల తోటి ఉద్యోగుల అసహనానికి, విమర్శలకు గురవుతారు.అధికారుల ఆగ్రహానికి కూడా గురై ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు కాబట్టి అతి అనర్థదాయకం అని గ్రహించి, దూకుడు తగ్గించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1, 2, 4,5,6; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, దుర్గాదేవిని ఆరాధించడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం మంచిది. పొట్లకాయకు, చికెన్‌కు దూరంగా ఉండటం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్


