ఆశిన్‌చినంతగా..! | No best movie for asin after ghajini | Sakshi
Sakshi News home page

ఆశిన్‌చినంతగా..!

Jul 28 2015 11:34 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఆశిన్‌చినంతగా..! - Sakshi

ఆశిన్‌చినంతగా..!

‘గజిని’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆశిన్...

‘గజిని’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఆశిన్. అమీర్‌ఖాన్ సరసన నటించడం, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘ఇక రాబోయే కాలమంతా అశిన్‌దే’ అనుకున్నారు సినీ పండితులు. టాప్-1 హీరోయిన్‌ల లిస్ట్‌లో ఆమె పేరు చేరడం ఖాయం అని కూడా అన్నారు.
 
బరువు తగ్గడం నుంచి స్టైల్ సెన్స్  వరకు బాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్లుగా  తనను తాను మలుచుకునే విషయంలో బాగానే కష్టపడింది. అయినప్పటికీ ఆమెకు ‘గజిని’ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ఇప్పుడు అశిన్ చేతిలో ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమా మాత్రమే ఉంది.
‘‘యువ హీరోలతో నటించాలని ఉంది’’ అని ఒక ఇంటర్య్వూలో చెప్పింది అశిన్. అయితే ఆమె కోరిక నెరవేరడం లేదు.
‘‘ఇక నా ప్రాధాన్యత బాలీవుడ్ మాత్రమే’’ అని సౌత్‌ఫిల్మ్స్‌ను తిరస్కరించిన  అశిన్ రేసులో ఎందుకు వెనక బడింది?
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం, రకరకాల కండిషన్‌లు పెట్టే ధోరణి వల్లే  దర్శక, నిర్మాతలెవరూ ఆశిన్ గురించి ఆలోచించడం లేదట. దీంతోపాటు వ్యక్తిగత విషయాలు కూడా ఆమె కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి.  
మరోవైపు తమన్నా, కాజల్ అగర్వాల్, ఇలియానాలు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం కూడా...అశిన్ కెరీర్‌పై ప్రభావాన్ని చూపింది.
వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఆల్‌ఈజ్ వెల్’ హిట్ కాకపోతే...ఇక ముంబాయికి టాటా చెప్పి తట్టా బుట్టా సర్దుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement