నిర్లవణీకరణకు కొత్త మార్గం!

New Way For Sea Water Desalination to Drinking Water - Sakshi

సముద్రపు నీటిని పూర్తిస్థాయిలో మంచినీటిగా మార్చగలిగితే భూమ్మీద నీటి కొరతన్నది అస్సలు ఉండదు. అయితే వేర్వేరు కారణాల వల్ల పూర్తిస్థాయి నిర్లవణీకరణ అన్నది సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని కింగ్‌ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన వినూత్న పరికరం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వాడుకుంటూ ఈ పరికరం సముద్రపు నీటిలోని లవణాలను తొలగించడం.. తద్వారా మంచినీటిని తయారు చేయడం విశేషం. సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా విద్యుత్తు ఎంత ఉత్పత్తి అవుతుందో అందుకు ఎన్నో రెట్లు ఎక్కువ వేడి కూడా పుడుతూంటుంది. ఈ వేడి కారణంగా కాలక్రమంలో సోలార్‌ ప్యానెల్స్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతూంటుంది కూడా. సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు సోలార్‌ ప్యానెల్స్‌ అడుగుభాగంలో పలు పొరలు ఏర్పాటు చేసి ఉపయోగించారు. గొట్టాలతో కూడిన ఈ పొరల గుండా ఉప్పునీరు ప్రయాణించినప్పుడు సోలార్‌ ప్యానెల్స్‌ తాలూకూ వేడి కారణంగా వేడిగా మారతాయి. ఇలా పుట్టిన ఆవిరి పలుచటి త్వచం ద్వారా ఇంకో పొరలోకి చేరుతుంది. అక్కడ ఘనీభవించి మంచినీరుగా మారుతుంది. ఈ ఏర్పాటు కారణంగా సోలార్‌ ప్యానెల్స్‌ చల్లగా ఉంటూ విద్యుదుత్పత్తిలో నష్టం జరగదని.. అదే సమయంలో ప్యానెల్స్‌ను శుభ్రం చేసుకునేందుకు లేదా పంటలు పండించుకునేందుకు అవసరమైన మంచినీరు అందుబాటులోకి వస్తుందని సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top