స్లీవ్‌  లెస్స | Sakshi
Sakshi News home page

 స్లీవ్‌  లెస్స

Published Fri, Feb 9 2018 3:00 AM

new fashion to  sleeveless blouse design - Sakshi

స్లీవ్‌లెస్‌ జాకెట్స్‌  తెలుసు కదూ!  ఇప్పుడు కాంట్రాస్ట్‌  స్లీవ్‌లతో స్లీవ్‌లెస్‌ కంటే కూడా  సూపర్‌గా ఉండే  స్లీవ్‌ లెస్స  అనిపించే డిజైన్లు ఇవి...

మల్టీకలర్‌ స్లీవ్స్‌
చీరకు పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌లో బ్లౌజ్‌ ఉంటే పెద్ద డిజైన్‌ అక్కర్లేదని ముందే అనుకున్నాం కదా! అలాగే పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌ ఫ్యాబ్రిక్స్‌ (ప్లెయిన్‌ పట్టు, రాసిల్క్, బెనారస్, నెటెడ్‌... వంటి క్లాత్‌ అయితే బాగుంటుంది) ఎంపిక చేసుకొని బ్లౌజ్‌ బాడీ పార్ట్‌కి ఒకే కలర్‌ ఫ్యాబ్రిక్‌ వేయాలి. చేతుల భాగానికి రెండు మూడురకాల ఫ్యాబ్రిక్‌తో కుట్టి, దాని మీద అందంగా ఎంబ్రాయిడరీ చేస్తే కొత్త లుక్‌ వచ్చేస్తుంది.  

బెనారస్‌తో బుట్టచేతులు 
బాడీ పార్ట్‌ చీర రంగు ప్లెయిన్‌ క్లాత్‌తో డిజైన్‌ చేయాలి. స్లీవ్స్‌ పార్ట్‌ చీరకు, బ్లౌజ్‌కి పూర్తి కాంట్రాస్ట్‌లో ఉండే బెనారస్‌ క్లాత్‌తో బుట్టచేతులతో డిజైన్‌ చేయించుకోవాలి. బెనారస్‌ ఫ్యాబ్రిక్‌ మీద ఆలోవర్‌ బుటా ఉండటం వల్ల ఇదే డిజైన్‌గా కనిపిస్తుంది. అందుకని స్లీవ్స్‌ పార్ట్‌కి వేరే మగ్గం వర్క్‌ వంటి ఎంబ్రాయిడరీ అవసరం లేకుండా చేతుల భాగాన్ని డిజైన్‌ చేయించుకోవచ్చు. బుట్ట చేతులు లేదంటే మోచేతుల వరకు చేతుల భాగాన్ని డిజైన్‌ చేసుకోవచ్చు. 

నెటెడ్‌తో నయనానందం
పట్టు చీరల మీదకు నెటెడ్‌ బ్లౌజ్‌లా అని ఆలోచించేవారుంటారు. ఇలాంటి వారు బ్లౌజ్‌ బాడీ పార్ట్‌ని పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేయించుకొని, చేతుల భాగానికి కాంట్రాస్ట్‌ నెటెడ్‌ ఫ్యాబ్రిక్‌ తీసుకోవచ్చు. నెట్‌ మరీ సాదా సీదాగా ఉంటుంది కాబట్టి దీని మీద గ్రాండ్‌ ఎంబ్రాయిడరీ చేస్తే లుక్‌ వావ్‌ అనిపిస్తుంది.

అక్కర్లేని పెద్ద పెద్ద డిజైన్లు
చీరకు బ్లౌజ్‌కి పూర్తి కాంట్రాస్ట్‌లో జాకెట్టు చేతుల భాగం ఉండటంతో త్వరగా చూపులను దోచేస్తుంది. అలాంటప్పుడు గాడీగా డిజైన్లు అక్కర్లేదని అతివల భావన. అందుకని ఈ స్లీవ్స్‌ భాగాన్ని సింపుల్‌ డిజైన్‌తో సరిపెట్టేయవచ్చు. 

పట్టుచీరలకూ కాంట్రాస్ట్‌
పట్టు చీర అంటే డిజైనర్‌ బ్లౌజ్‌ వేసుకోవాల్సిందే అనే ట్రెండ్‌ నిన్నా మొన్నటిది. ఇప్పుడు పట్టులోనూ కాంట్రాస్ట్‌ స్లీవ్స్‌ ప్యాటర్న్‌ బాగా ఆకట్టుకుంటుంది. బ్లౌజ్‌ భాగాన్ని చీర బాడీ ప్యాటర్న్‌ని, చేతుల భాగాన్ని చీర అంచు భాగంతో డిజైన్‌ చేస్తే ఓ సరికొత్త లుక్‌ వచ్చేస్తుంది.

బాడీ పార్ట్‌ కాంట్రాస్ట్‌
చీరకు పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌ ఫ్యాబ్రిక్‌ విడిగా తీసుకొని బ్లౌజ్‌ బాడీ పార్ట్‌ని డిజైన్‌ చేయించుకోవాలి. చేతుల భాగానికి చీరలో ఇచ్చే బ్లౌజ్‌ ఫాబ్రిక్‌తో డిజైన్‌ చేయించాలి. దీంతో ఒక ప్రత్యేక లుక్‌తో పార్టీలో మెరిసిపోతారు.

∙ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌ బ్లౌజ్‌లతో పోల్చితే ఈ కాంట్రాస్ట్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ల డిజైన్‌కి ఖర్చు తక్కువే అవుతుంది. 
∙దీనికి ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు చీరకు పూర్తి కాంట్రాస్ట్‌ క్లాత్‌ల ఎంపిక సులువు కూడా! 
∙చేతుల పార్ట్‌కి విడిగా ఎంబ్రాయిడరీ చేయించిన పార్ట్‌ని ప్యాచ్‌లా తర్వాత జత చేసుకోవచ్చు.
- నిర్వహణ ఎన్‌.ఆర్‌



 

Advertisement

తప్పక చదవండి

Advertisement