ఈసీజీకి కృత్రిమ మేధ హంగు!

The new ECG method is available - Sakshi

ఈసీజీ గురించి మీరు వినే ఉంటారు. గుండె పనితీరును అంచనా వేసేందుకు అందుబాటులో ఉన్న ఈ పురాతన పద్ధతిని పూర్తిగా మార్చేశారు మేయో క్లినిక్‌ శాస్త్రవేత్తలు. గుండె విద్యుత్‌ సంకేతాలను గుర్తించడానికి పరిమితం కాకుండా గుండెజబ్బులను చాలా తొందరగా గుర్తించడం ఈ కొత్త పద్ధతి ప్రత్యేకత. ఖరీదైన పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారించే వీలున్న లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ డిస్‌ఫంక్షన్‌ను ఈ కొత్త పద్ధతి ద్వారా గుర్తించవచ్చు. ఎటువంటి సంకేతాలు కూడా చూపకపోవడం ఈ లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ డిస్‌ఫంక్షన్‌.. రక్త పరీక్షల ద్వారా గుర్తించేందుకు అవకాశమున్నా ఫలితాలు ఎప్పుడూ ఒకేలా లేకపోవడం నేపథ్యంలో ఈ కొత్త ఈసీజీ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఈ కొత్త ఈసీజీ పద్ధతి గుండెజబ్బు అవకాశాలను అంచనా వేస్తుందని చవకగా కేవలం పది సెకన్లలో అయిపోవడం మరో లాభమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్‌ ఫ్రైడ్‌మ్యాన్‌ తెలిపారు. దాదాపు ఆరు లక్షల మంది ఈసీజీ వివరాల ఆధారంగా పనిచేసే ఈ కృత్రిమ మేధ వ్యవస్థను ఇప్పటికే 50 వేల మందిపై విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా. అతిసున్నితమైన అంశాలను పసిగట్టడం ద్వారా గుండెజబ్బులను చాలాముందుగా గుర్తించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పార 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top