ఓ రాధ.. ఇద్దరు కృష్ణులు కాదు | Nani, niveda thamas doing new movie | Sakshi
Sakshi News home page

ఓ రాధ.. ఇద్దరు కృష్ణులు కాదు

May 21 2017 3:33 AM | Updated on Sep 5 2017 11:36 AM

ఓ రాధ.. ఇద్దరు కృష్ణులు కాదు

ఓ రాధ.. ఇద్దరు కృష్ణులు కాదు

‘నిన్ను కోరి’... ఈ సినిమాలో ఓ హీరోయిన్, ఇద్దరు హీరోలున్నారు.

‘నిన్ను కోరి’... ఈ సినిమాలో ఓ హీరోయిన్, ఇద్దరు హీరోలున్నారు. అలాగని, ఓ రాధ ఇద్దరు కృష్ణులు టైప్‌ సినిమా కాదిది. అమెరికా నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్చమైన, స్వచ్ఛమైన ప్రేమకథ. ఈ స్టోరీ బోల్డన్ని ట్విస్టులతో ఎగై్జటింగ్‌గా ఉంటుందట. ఇందులో నాని, నివేదా థామస్‌ జంటగా, హీరో ఆది పినిశెట్టి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని ఎప్పుడో సినిమా ఓపెనింగ్‌ అప్పుడే అనౌన్స్‌ చేశారు.

అక్కడవరకూ బాగుంది. కానీ, ప్రేక్షకులకు ఓ క్లారిటీ మిస్‌ అవుతోంది. ముఖ్యమైన పాత్ర అంటే... సినిమా మొదట్లోనో లేదా ముగింపులోనో ఆది పాత్ర కాసేపు ఉంటుందను కోవచ్చు. కట్‌ చేస్తే... స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ మాగ్జిమమ్‌ సీన్స్‌లో ఆది కనిపిస్తారట. శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అయ్యిందట. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement