breaking news
Niveda thamas
-
ఒక సినిమాకు ఇన్ని స్టార్స్ ఇవ్వడం నేనేప్పుడు చూడలేదు: రానా
ఒక మంచి సినిమా వస్తే..దాన్ని మీడియా ఎంత బాగా ప్రమోట్ చేస్తుందో ‘35-చిన్న కథ కాదు’చిత్రం ద్వారా తెలిసింది. ఈ సినిమాకి మీరు(మీడియా) ఇచ్చినన్ని స్టార్స్ నేను ఎప్పుడూ చూడలేదు .చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్ ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరో రానా. నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ‘35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ హిట్అందుకుంది. (చదవండి: 35: చిన్న కథ కాదు మూవీ రివ్యూ)ఈ సందర్భంగా మూవీ టీం థాంక్స్ మీట్ ని నిర్వహించింది. ప్రెస్ మీట్లో రానా మాట్లాడుతూ.. 35-చిన్న కథ కాదు' సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచి తన భుజాలపై సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. తనతో వర్క్ చేయడం హానర్ గా ఉంది. సురేష్ ప్రొడక్షన్ పిట్టగోడ ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. 35లో తన నటన సర్ ప్రైజ్ చేసింది. మంచి కథలు చేయాలనే తపన తనని ఇంకా ముందుకు తీసుకెళుతుంది. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. ఈ సక్సెస్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మంచి కథలు ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే ఉంటాం' అన్నారునివేదా థామస్ మాట్లాడుతూ.. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ అందరికీ థాంక్. ఈ సక్సెస్ ఇక్కడ నుంచి మొదలైయింది. మేము పర్శనల్ గా వచ్చి ఆడియన్స్ కి థాంక్స్ చెబుతాం. అందరికీ థాంక్ యూ' అన్నారు‘ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్, మీడియా ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తారో మరోసారి '35-చిన్న కథ కాదు' తో ప్రూవ్ అయ్యింది. థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. థియేటర్స్ లో ఒక ఫెస్టివల్ లా ఉంది. సినిమా తమ జీవితాన్ని తెరపై చూపించిందని, మస్ట్ వాచ్ సినిమాని ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో విశ్వదేవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నంద కిశోర్, నిర్మాతలు సిద్ధార్థ్ రాళ్లపల్లి ,సృజన్ యరబోలు పాల్గొన్నారు. -
ఓ రాధ.. ఇద్దరు కృష్ణులు కాదు
‘నిన్ను కోరి’... ఈ సినిమాలో ఓ హీరోయిన్, ఇద్దరు హీరోలున్నారు. అలాగని, ఓ రాధ ఇద్దరు కృష్ణులు టైప్ సినిమా కాదిది. అమెరికా నేపథ్యంలో తెరకెక్కుతోన్న అచ్చమైన, స్వచ్ఛమైన ప్రేమకథ. ఈ స్టోరీ బోల్డన్ని ట్విస్టులతో ఎగై్జటింగ్‌గా ఉంటుందట. ఇందులో నాని, నివేదా థామస్ జంటగా, హీరో ఆది పినిశెట్టి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని ఎప్పుడో సినిమా ఓపెనింగ్ అప్పుడే అనౌన్స్ చేశారు. అక్కడవరకూ బాగుంది. కానీ, ప్రేక్షకులకు ఓ క్లారిటీ మిస్ అవుతోంది. ముఖ్యమైన పాత్ర అంటే... సినిమా మొదట్లోనో లేదా ముగింపులోనో ఆది పాత్ర కాసేపు ఉంటుందను కోవచ్చు. కట్ చేస్తే... స్టార్టింగ్ టు ఎండింగ్ మాగ్జిమమ్ సీన్స్‌లో ఆది కనిపిస్తారట. శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందట. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
ప్రెట్టీ కుట్టి
‘హలో...’ ‘కేరళ ఎక్కడ ఉంది?’ ‘కనపడటంలేదు.. కొంచెం బైనాక్యులర్స్ తీసుకు రండి!’ ‘అదిగో అక్కడ చిన్నగా ఉందే... అదే కేరళ.’ ‘కేరళ అక్కడెక్కడో కింద ఉంది కానీ... అక్కడి హీరోయిన్లు చూశారా... ఇక్కడ ఎంత ఎత్తుకి ఎదిగారో! పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, నాగచైతన్య... ఇలా స్టార్ల పక్కన నటిస్తున్నారు. ఈ ప్రెట్టీ కుట్టీలు చూడ్డానికి బ్యూటీగానే కాదు.. యాక్టింగ్‌తో కూడా మేజిక్ చేస్తున్నారు.’ ఆలస్యమే అమృతం! ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. అలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుందని ఈ సామెతకు అర్థం. కానీ, నివేదా థామస్ ప్రయాణం చూస్తే అలస్యమే అమృతమైందని చెప్పాలేమో! ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా అప్పట్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ఆ సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో నాని ‘జెంటిల్మన్’తో తెలుగు తెరకు పరిచయమయ్యారామె. అప్పటికే, తమిళంలో విజయ్ ‘జిల్లా’, కమల్‌హాసన్ ‘పాపనాశం’ చిత్రాల్లో చేసిన కీలక పాత్రలతో నటిగా నివేదకు మంచి పేరొచ్చింది. తెలుగులో తొలి సినిమా ‘జెంటిల్మన్’తో ఇక్కడి ప్రేక్షకులు, చలనచిత్ర ప్రముఖులను ఆకట్టుకున్నారు. అందం, అభినయం.. రెండిటిలోనూ నివేదకు మంచి మార్కులు పడ్డాయి. ‘జెంటిల్మన్’ తర్వాత నానీకి జంటగా మరోసారి నటిస్తున్నారీ భామ. శివ నిర్వాణని దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో నాని, నివేద, ఆది పినిశెట్టి నటిస్తున్నారు. స్టార్స్ లిస్ట్‌లో... సమంత వంటి స్టార్ హీరోయిన్ సినిమాలో ఉన్నప్పుడు... అందులోనూ ఆమె పాత్ర చుట్టూ నడిచే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అయినప్పుడు... అందులో సెకండ్ హీరోయిన్గా నటించిన అమ్మాయికి అరుదుగా గుర్తింపు లభిస్తుంది. కానీ, ‘అ.. ఆ’ ప్రచార చిత్రాల్లో అనుపమా పరమేశ్వరన్ చెప్పిన ‘రావణాసురుడి వాళ్లావిడ కూడా వాళ్ల ఆయన్ను పవన్‌కల్యాణ్ అనే అనుకుంటుంది’ అనే డైలాగ్ ఆమెకు పాపులారిటీ తీసుకొచ్చింది. ‘అ.. ఆ’లో కనిపించినంత సేపూ అందమైన నటనతో ఆకట్టుకున్న అనుపమ, తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అసలు మలయాళంలో అనుపమ హీరోయిన్గా పరిచయమైన ‘ప్రేమమ్’ పెద్ద హిట్. ఆ చిత్రం తెలుగు రీమేక్‌లో మాతృకలో చేసిన పాత్ర చేశారు. అయితే.. అనుపమ చేసిన ‘అ.. ఆ’, ‘ప్రేమమ్’ రెండూ మల్టీ హీరోయిన్ చిత్రాలే. త్వరలో సోలో హీరోయిన్గా సందడి చేయనున్నారు. శర్వానంద్ సరసన ఆమె నటించిన ‘శతమానం భవతి’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇది కాకుండా అనుపమ తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించనున్న చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ను నాయికగా తీసుకున్నారని సమాచారం. మెల్లిగా అనుపమ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతున్నారు. తక్కువ టైమ్‌లో కీర్తి తెలుగు తెరపై కీర్తీ సురేశ్ అడుగుపెట్టి సరిగ్గా సంవత్సరం అవుతుంది. గత ఏడాది జనవరి 1న విడుదలైన రామ్ ‘నేను – శైలజ’తో ఈ మలయాళ ముద్దుగుమ్మ మన తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ చిత్రం చూసిన వాళ్లంతా... మన పక్కింటి అమ్మాయిలా భలే నటించిందీ హీరోయిన్ అన్నారు. ఆవేదన, ఆనందం, అలజడి.. ఏదైనా మనసులోనే దాచుకునే శైలజ పాత్రలో కీర్తీ సురేశ్ భావోద్వేగాలు పండించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘నేను –శైలజ’ తర్వాత తమిళ అనువాద చిత్రాలు ‘రైల్’, ‘రెమో’లతో తెలుగు తెరపై కనిపించారు తప్ప... కీర్తీ సురేశ్ స్ట్రయిట్ తెలుగు చిత్రంతో మన ముందుకు రాలేదు. కానీ, ఆమెకు మంచి ఛాన్సులు వచ్చాయి. హీరో నానీకి జోడీగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఆమె నటించిన ‘నేను లోకల్’ ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇది కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న సినిమాలో ఆయనకు జోడీగా నటించే బంపర్ ఆఫర్ కొట్టేశారు. మరోవైపు తమిళంలోనూ విజయ్, సూర్య వంటి స్టార్ల సరసన నటిస్తున్నారు. కళ్లు మూసి తెరిచే లోపే ‘కళ్లు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే...’ – ‘మజ్ను’ చిత్రంలో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌ను చూసి ప్రేమలో పడిన హీరో నాని పాడిన పాట ఇది. ఈ అమ్మాయి నవ్వు, నటనకు ఫిదా అయిన యువత కూడా థియేటర్ బయటకొచ్చిన తర్వాత ఈ పాటే పాడారు. ‘మజ్ను’ హిట్‌తో అనూకి సూపర్ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. గోపీచంద్ ‘ఆక్సిజన్’, రాజ్‌తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలను ‘మజ్ను’లో నటిస్తున్నప్పుడే అంగీకరించారామె. ఈ రెండూ వినూత్న కథలతో రూపొందుతోన్న చిత్రాలే. ఇక, ‘మజ్ను’ విడుదల తర్వాత ఆమెకు వచ్చిన ఛాన్స్ స్టార్ హీరోయిన్స్ రేసులోకి తీసుకువెళ్లింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న ప్రేమకథా చిత్రంలో ఓ నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ఎంపికయ్యారు. ఈ ఛాన్స్ ఆమెను కూడా సర్ప్రైజ్ చేసింది. ‘‘ఓ ఐదేళ్ల తర్వాత ఎప్పుడో పవన్‌కల్యాణ్ పక్కన నటించే ఛాన్స్ వస్తుందనుకున్నా! తెలుగు తెరకు పరిచయమైన ఏడాదిలోపే వస్తుందనుకోలేదు’’ అన్నారు అను. ఈ మూడు చిత్రాలూ ఈ ఏడాదే విడుదల కానున్నాయి. ఈలోపు అనూ ఇమ్మాన్యుయేల్ ఇంకెన్ని ఛాన్సులు అందుకుంటారో! మలయాళీ హీరోయిన్లు తెలుగు తెరపై రాణించడం ఇదేమీ కొత్త కాదు. ఆల్రెడీ అసిన్, మమతా మోహన్‌దాస్, మీరా జాస్మిన్, నయనతార, నిత్యామీనన్ తదితర కేరళ కుట్టీలు మనవాళ్లను తెగ మెప్పించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్, నివేదా థామస్, కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్‌లు ఒక్క ఏడాదిలో తెలుగు తెరపై తారాజువ్వలా దూసుకెళుతుండడం చెప్పుకోదగ్గ విశేషం. -
ఆల్మోస్ట్ అమెరికాలో...
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్యతారలుగా శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం బుధవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు కొరటాల శివ కెమేరా స్విచాన్ చేయగా, వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘అమెరికాలో 80 శాతం, మిగతా చిత్రాన్ని హైదరాబాద్, విశాఖలో చిత్రీకరిస్తాం. డిసెంబర్ 5న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘సున్నితమైన అంశాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే కథకు బలం’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘నాకు ఇష్టమైన వ్యక్తులు, చిత్ర బృందంతో కలసి పని చేయడం హ్యాపీగా ఉంది’’ అని నాని తెలిపారు. దర్శకులు రవిరాజా పినిశెట్టి, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, దామోదర ప్రసాద్, ‘దిల్’ రాజు, శిరీష్, రవిశంకర్ పాల్గొన్నారు.