న న్నడగొద్దు ప్లీజ్‌ | love problems and solutions | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Aug 14 2017 12:25 AM | Updated on Sep 17 2017 5:29 PM

న న్నడగొద్దు ప్లీజ్‌

న న్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్‌! నేను బీటెక్‌ కంప్లీట్‌ చేశాను. సాఫ్ట్‌వేర్‌ కోర్స్‌ నేర్చుకోవడానికి హైదరాబాద్‌ వచ్చాను.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌! నేను బీటెక్‌ కంప్లీట్‌ చేశాను. సాఫ్ట్‌వేర్‌ కోర్స్‌ నేర్చుకోవడానికి హైదరాబాద్‌ వచ్చాను. కోర్స్‌ పూర్తయింది. నేను ఎప్పుడూ అమ్మాయిల విషయం పెద్దగా పట్టించుకోలేదు. మొదటిసారి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. నాకు తెలుసు ఇది కేవలం ఇన్‌ఫాచ్యుయేషన్‌ అని. నేను నా కెరీర్‌లో ఇంకెలాంటి డిస్ట్రబెన్సూ తెచ్చుకోవడానికి రెడీగా లేను. వన్‌ ఇయర్‌గా మరచిపోవడానికి ట్రై చేస్తున్నా. కానీ రోజుకు ఒక్కసారైనా ఆ అమ్మాయి గుర్తుకొస్తోంది. ప్లీజ్‌ ఏదైనా సలహా ఇవ్వగలరు. – కిరణ్‌
ఏంటి నీలాంబరీ... అరటిపండును చిన్న చిన్న ముక్కలు చేశావు? ‘సార్‌ మీరు నోరు ఓపెన్‌ చేసి అక్కడే కూర్చోండి! నేను ఇక్కడ నుంచీ....’ ఏమయినా డస్ట్‌ బిన్‌ లాగా కనబడుతుందా నా నోరు...? ‘సార్‌ టార్గెట్‌ ప్రాక్టీస్‌ సార్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌!’ నీ దుంప తెగ! నీ టార్గెట్‌ ప్రాక్టీస్‌కి నన్ను ఇలా వాడుకుంటావా? ‘ఏంటి సార్‌ వాడుకోవడం అంటారు? అంత ప్రేమగా ముక్కలు బాస్కెట్‌ బాల్‌ వేసినట్లు వేస్తానంటుంటే... కొంచెం కోపరేట్‌ చెయ్యండి సార్‌ ప్లీజ్‌ ప్లీజ్‌!!’

నేనేమయినా కిరణ్‌ ప్రేమించిన అమ్మాయిననుకుంటున్నావా కోపరేట్‌ చెయ్యడానికి... ‘అవును సార్‌.. ఆ అమ్మాయిని చూసి పడ్డాడు బుట్టలో సార్‌.. కానీ ఫోకస్‌ పడకుండా ఉంటున్నాడు.. నేను కూడా కిరణ్‌లా ఫోకస్‌లో ఉండడానికి ముక్క పడకుండా వేస్తా కాసుకోండి సార్‌!!’ అర్థమయ్యిందా కిరణ్‌.. ఇన్‌ఫాచ్యుయేషన్‌ అని లవ్‌ కాదని.. డెఫినెట్‌గా డిస్టర్బ్‌ కాకూడదు అనుకున్నప్పుడు...నీలాంబరి లాగా నువ్వు కూడా అరటిపండు ముక్కలు కోసుకుని... ‘కోసుకుని మీ నోట్లోకి పారేయ్యమంటారా సార్‌?’ తల్లీ... ముక్కలు పైకి ఎగురవేసి మీరే నోటితో పట్టుకోండి... పడకుండా!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement