నన్నడగొద్దు ప్లీజ్‌ | love problems and solutions | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Aug 8 2017 11:34 PM | Updated on Sep 17 2017 5:19 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ అన్నయ్యా.. నేను రోజూ ‘లవ్‌ డాక్టర్‌’ చదువుతాను.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా.. నేను రోజూ ‘లవ్‌ డాక్టర్‌’ చదువుతాను. ఇంచుమించు ఒన్‌ ఇయర్‌ నుంచి మేం ప్రేమించుకుంటున్నాం. పేరెంట్స్‌ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే అమ్మాయి వాళ్ల ఇంట్లో చెప్పడానికి బాగా భయపడుతోంది. ‘వాళ్లు ఒప్పుకోరు చచ్చిపోదాం’ అంటోంది. ‘అలా చెయ్యడం తప్పు’ అని చెప్పా. కాస్త కూల్‌గానే ఉంది. కానీ, ‘ఇంట్లో వాళ్లకు చెబితేనే కదా తెలిసేది’ అంటే ‘ఈ సంగతి తెలిస్తే మా పేరెంట్స్‌ చనిపోతారు’ అంటోంది. వాళ్లు తనకి పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు. ‘మా పేరెంట్స్‌ వచ్చి మీ పేరెంట్స్‌తో మాట్లాడతారు’ అంటే... ‘వద్దు మా ఇంట్లో వాళ్లు బాధపడతారు’ అంటోంది. పైగా ‘నేను హ్యాపీగా లేకపోయినా ఫర్లేదు, మా పేరెంట్స్‌ బాగుండాలి’ అంటోంది. ‘తన అమ్మానాన్నలు ఏం చెబితే అదే వింటా’ అంటోంది. నేను తను లేకుండా బతకలేను. ఏం చెయ్యమంటారు సార్‌. సలహా ఇవ్వండి. – సుభాని
అగాధమవు జలనిధిలోనా ఆణిముత్యమన్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే..... ‘సార్‌.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పాటలు పాడితే యూత్‌కి ఏమి అర్థమౌతుంది సార్‌’ ఈ మాత్రం అర్థం కాదా? ‘ఏంటి సార్‌ ఈ మాత్రం.. అని నొక్కి నొక్కి చెబుతున్నారు. ఒక్క ముక్క అంటే ఒక్క ముక్కా అర్థం కాలేదు’ అది తెలుగు... నీలాంబరీ!! ‘అది తెలుగు... అని మళ్లీ నొక్కుతున్నారేంటి సార్‌? అంటే ఇవాళ్టి యూత్‌కి తెలుగు రాదు... అని అంటున్నారా?’అవ్వ! నేనలా అన్నానా!! ‘మీదంతా మతలబులే సార్‌... ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ స్ట్రెయిట్‌గా ఏదీ చెప్పరు. ఇక చెబితే ఇలా అర్థం కాకుండా చెబుతారు. అసలు దాని మీనింగ్‌ మీకు తెలుసా సార్‌?’

సముద్రమంతా దుఃఖం మింగేస్తున్న.. ప్రేమను తుఫానులు కుదిపేస్తున్నాయి ఆ సముద్రం లోతులలోనే సుఖం దాగి ఉంది అని చెప్పా!
అమ్మాయి ప్రేమ ఆణిముత్యం లాంటిది దాన్ని శంకించకు! పడవ మళ్లించు కొత్త దీవి వైపుకు పయనించు.. అని చెప్పా!! లైఫ్‌ ఈజ్‌ టూ షార్ట్‌ టు క్రై... పేరెంట్స్‌ను కన్విన్స్‌ చేయలేనప్పుడు పేరెంట్స్‌ను గౌరవించమని చెప్పా!!‘అరటి తొక్క మరుగున దాగి పండు ఉన్నట్లే...’ అని నవ్వింది నీలు.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

 

Advertisement
 
Advertisement
Advertisement