నన్నడగొద్దు ప్లీజ్‌ | love problems and solutions | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Jun 21 2017 12:00 AM | Updated on Sep 5 2017 2:04 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్, రామ్‌ సర్‌! నేను 2 ఇయర్స్‌ నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను.

 లవ్‌ డాక్టర్‌


హాయ్, రామ్‌ సర్‌! నేను 2 ఇయర్స్‌ నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. నెల క్రితం ఇద్దరి ఇంట్లో మా విషయం తెలిసిపోయింది. ఓకే అన్నారు. కానీ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సౌదీ వెళ్లి మనీ సంపాదించాలని ఉంది. కానీ అమ్మాయి వినడం లేదు. తనకి డైలీ లవ్‌ డాక్టర్‌ చదివే అలవాటు ఉంది! మీరే తనకు చెప్పండి సార్‌!
 – బాషా

అమ్మాయి గారూ! దీనిని బాషా రికమండేషన్‌ లెటర్‌గా భావించండి! మీరు లవ్‌ డాక్టర్‌ రెగ్యులర్‌గా చదువుతారటా! బాషా చదవడు కాబట్టి మనం సీక్రెట్‌గా మాట్లాడుకుందాం! ‘సార్‌ తొక్క మీద కాలేసినట్టున్నారు’ అని నీలాంబరి ఎంట్రీ ఇచ్చింది. వై? ‘బాషా కూడా సీక్రెట్‌గా లవ్‌ డాక్టర్‌ చదివేస్తే..?’ క్యా హోతా? ‘మీ కొంప మునుగును..!’ వానాకాలం కొంపలు మునుగుడు సర్వ సాధారణం! ‘సార్‌ నాట్‌ దట్‌ కొంప... మీ ప్రాక్టీస్‌ మునుగున్‌!’ మన ప్రాక్టీస్‌ ఏమైనా అరటి తోటా... మునిగితే మునగడానికి? ‘సరే సార్‌! కానివ్వండి... అక్కడ అమ్మాయి సీక్రెట్‌ కోసం వెయిటింగ్‌!’ బంగారం... బాషాకి పైసల్‌ కావాలె! దిల్‌ అక్కర్లేదు!

ఎందుకంటే నువ్వు ఆల్‌ రెడీ కమిట్‌ అయిపోయావు కదా! అందుకే నువ్వు లైట్‌! పైసల్‌ టైట్‌! ఇదేనమ్మా మగవాడి లక్షణం! అదే నువ్వు నాట్‌ ఓకే చెప్పి ఉంటే... నువ్వే కావాలని, కొంచెం రికమెండ్‌ చేయమని రిక్వెస్ట్‌ చేనేవాడు బాషా. లక్కీగా బాషా ఈ ఆన్సర్‌ చదవడంలేదు కాబట్టి నీకో సలహా చెబుతా..! ‘సార్‌ జాగ్రత్త బాషా భాయ్‌ చదివేస్తాడేమో..!’ నీలాంబరీ...! నువ్వు అరటిపండు తిను! నన్ను డిస్టర్బ్‌ చేయకు! చెల్లెమ్మా... నువ్వు కూడా కొంచెం స్టైల్‌ కొట్టు! బాషా భాయ్‌ ఇంకో రికమెండేషన్‌ లెటర్‌ కోసం నాకు రాస్తాడు! ‘మీరు, మీ చెల్లెలు కలిసి మీ ప్రాక్టీస్‌ బాగానే డెవలప్‌ చేసుకుంటున్నారు...’ అని నవ్వింది నీలాంబరి!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement