నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Sep 19 2017 12:05 AM | Updated on Sep 19 2017 4:44 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్‌ నా పేరు ఆనంద్‌. నేను డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌ నా పేరు ఆనంద్‌. నేను డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. కాలేజ్‌లో ఒక అమ్మాయి నన్ను లవ్‌ చేసింది. తరువాత నేను కూడా ఆ అమ్మాయిని లవ్‌ చేశాను. మేము సంవత్సరం వరకూ బాగానే ఉన్నాం. తననే మ్యారేజ్‌ చేసుకోవాలని అనుకున్నా.. బట్‌ తను వేరే అబ్బాయిని లవ్‌ చేయడం మొదలు పెట్టింది. తను మోసం చేస్తాడు అని తెలిసి కూడా లవ్‌ చేస్తోంది. నన్ను పూర్తిగా మరిచిపోయింది. కానీ నేను తనని మరిచిపోలేకపోతున్నా. తనను పెళ్లి చేసుకోవాలని ఉంది. తనను నాతో కలిపే సమాధానం చెప్పండి ప్లీజ్‌.
- ఆనందరావు

అయ్యయ్యో!! ఎంత కష్టం వచ్చింది బ్రదర్‌! అమ్మాయే నిన్ను ఫస్ట్‌ లవ్‌ చేసింది! అవును సార్‌ అమ్మాయే ఫస్ట్‌ లైట్‌ కొట్టింది!’ ఆ తరువాతే మనోడు సైట్‌ కొట్టాడు! ఎగ్జాట్లీ.. తరువాతే సైట్‌ కొట్టాడు సార్‌!! అమ్మాయే ఫస్ట్‌ కటింగ్‌ చేసింది! పెర్ఫెక్ట్‌గా అర్థం చేసుకున్నారు సార్‌!!’  ఇప్పుడు మనోడు కటింగ్‌ చేసేసుకుంటే పోలా? ఎటకారమా సార్‌? అక్కడ బిడ్డ ప్రేమలో గిలగిలలాడుతుంటే కటీఫ్‌ చేయమంటారా సార్‌? మరి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తోంది కదా? ‘కదా?’ ఒక పని చెయ్యమను!!

‘వెయిట్‌ చేయమని మాత్రం చెప్పకండి సార్‌..!’ యహే... నేనెందుకు అలా చెబుతా.. వెయిట్‌ చెయ్యొద్దని చెప్పు!! సార్‌..... ఇంకో అమ్మాయిని ప్రేమించమంటారా సార్‌? నేనలా అనలేదు... వెయిట్‌ చెయ్యొద్దు! సాగిపో ముందుకు!! అని చెప్పా.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement