నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Sep 13 2017 12:17 AM | Updated on Sep 19 2017 4:26 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ అన్నా! నాకు ఒక ఎగ్జామ్‌ సమయంలో ఒకబ్బాయి పరిచయం అయ్యాడు.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నా! నాకు ఒక ఎగ్జామ్‌ సమయంలో ఒకబ్బాయి పరిచయం అయ్యాడు. తన లైఫ్‌లో చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్‌ చేశారు. కానీ, తను మాత్రం నాతో మాట్లాడినంత క్లోజ్‌గా ఏ అమ్మాయితోనూ మాట్లాడడు. తను చాలా మంచివాడు. తను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాడు. తను ఒకసారి నన్ను.. ‘నేనంటే ఇష్టమా?’ అని అడిగాడు. ‘ఇష్టమే’ అని చెప్పాను. అప్పుడు తను.. ‘ఫస్ట్‌ నేను లైఫ్‌లో మంచిగా సెటిల్‌ అవ్వాలి. నిన్ను చూసుకోవాలంటే నాకంటూ ఓ పొజిషన్‌ ఉండాలి కదా’ అన్నాడు.

కానీ.. నన్ను లవ్‌ చేస్తున్నానని మాత్రం చెప్పలేదు. లవ్‌ మ్యారేజ్‌కి మా ఇంట్లో కానీ వాళ్ల ఇంట్లోకానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ‘ఫస్ట్‌ నువ్వు కూడా సెటిల్‌ అవ్వు’ అని చెప్పాడు. తనని వదులుకోవడంæ నా వల్ల కాదు అన్నయ్యా! ప్లీజ్‌ మంచి సలహా ఇవ్వండి!!  - స్వీటీ


ప్రేమిస్తున్నప్పుడు.. అప్పుడేంటి సార్‌..?’ ప్రేమించాలి! ‘మరి స్వీటీ ఏమి చేస్తోంది సార్‌?’ ఆలోచిస్తోంది! ఎక్కువ ఆలోచిస్తోంది!! ‘ప్రేమిస్తే ఆలోచించొద్దా సార్‌?’ ఆలోచిస్తే ప్రేమించడం ఎక్కడ ఉంటుంది నీలూ..! చాలా కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు సార్‌!’ అబ్బాయి సెటిల్‌ అయ్యేదాకా వెయిట్‌ చెయ్యమన్నాడని భయపడుతోంది!!

భయం ఎందుకు సార్‌!?’ సెటిల్‌ అయ్యాక పట్టించుకోడేమో అని! ‘అలా చేస్తాడంటారా సార్‌!?’ ప్రేమించేవాడి ప్రేమ నిజమయితే చెయ్యడు! కొంచెం తక్కువ నిజమయితే..? టైమ్‌ని గెలవలేని లవ్‌... ప్రేమ కాదు!! ‘మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి సార్‌?’ ప్రేమను నమ్మాలి! వెయిట్‌ చెయ్యాలి!!
 - ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

 

Advertisement
 
Advertisement
Advertisement