నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Sep 9 2017 12:03 AM | Updated on Sep 17 2017 6:36 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ అన్నా! ఒక నెల నుంచి అమ్మాయికి ట్రై చేస్తున్నా.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నా! ఒక నెల నుంచి అమ్మాయికి ట్రై చేస్తున్నా. తనది మా కాలేజ్‌నే. మాట్లాడాలి అంటే ఎప్పుడూ వాళ్ల ఫ్రెండ్స్‌ ఉంటారు తనతో. ఒకసారి ‘మాట్లాడాలి’ అని అడిగా. ‘ఏంటి చెప్పు’ అంది నాకు భయం వేసి ఏం చెప్పకుండా వెళ్లిపోయా. ఇప్పుడు ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. రౌండ్స్‌ వేసి వేసి నా బైక్‌లో పెట్రోల్, తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతున్నాయి. ఎలా చెప్పాలో చెప్పు భయ్యా.. ప్లీజ్‌ సేవ్‌ మై హెల్త్‌! -  రసూల్‌

‘సార్‌!’ ఏంటి? ‘ఏమీ లేదులే సార్‌!’ ఉం...!? ‘సార్‌...’ ఏంటి చెప్పు? ‘వద్దులే సార్‌!’ ఏంటి నీలాంబరీ? ‘ఏంటి చెప్పు... అని అంత కోపంగా అంటే ఏం చెబుతాం సార్‌!’ నవ్వుతూ అడగాలా? వద్దులే సార్‌. పాపం రసూల్‌ కూడా నాలాగే ఫీల్‌ అయ్యాడు సార్‌!’ గౌరవంగా మనసులో మాట చెప్పుకునే సంస్కారం లేనప్పుడు ప్రేమించడం ఎందుకు!? ‘అవును సార్‌ పెట్రోల్, చెప్పులు దండగ! ఏంటి? నేను చెప్పినవన్నీ ఒప్పుకుంటున్నావు ఇవాళ?

‘మంచి చేసుకుంటున్నా సార్, రసూల్‌కి మంచి మాట చెబుతారని..’ రసూల్‌ భాయ్‌! ఇట్స్‌ ఓకే అన్నా. లైఫ్‌లో ఎప్పుడూ కావల్సినవి దొరకవు! అప్పుడప్పుడూ మిస్‌ అవుతాయి!! మిస్‌ అయినప్పుడు ఇంకా మంచివి జరుగుతాయి! నవ్వడం నేర్చుకో!! అప్పుడు అదృష్టం మళ్లీ నవ్వుద్ది.. బై!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com
 

Advertisement
 
Advertisement
Advertisement