నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Aug 19 2017 12:21 AM | Updated on Sep 17 2017 5:40 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్‌! నేను మీకు పెద్ద అభిమానిని. రెగ్యులర్‌గా మీ లవ్‌ డాక్టర్‌ చదువుతుంటాను.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌! నేను మీకు పెద్ద అభిమానిని. రెగ్యులర్‌గా మీ లవ్‌ డాక్టర్‌ చదువుతుంటాను. నేను డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. నేను కొన్ని రోజులుగా ఒక అమ్మాయిని హాఫ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌గా ఫీల్‌ అవుతున్నాను. కానీ, ఒక గొడవ వల్ల నేను చాలా హర్ట్‌ అయ్యాను. తనకు చెప్పలేదు కానీ నాకు నేనే బ్రేకప్‌ చేసుకుందామని ఫిక్స్‌ అయ్యాను. కానీ తన ఆలోచనలు నన్ను వదలడం లేదు. తన నుంచి మెసేజ్‌ వస్తే రిప్లై ఇవ్వకుండా ఉండలేకపోతున్నా. మిస్‌ కాల్‌ వస్తే కాల్‌ బ్యాక్‌ చేయకుండా ఉండలేకపోతున్నా.

చాలా డిస్టర్బ్‌ అవుతున్నా. నాకు నా భవిష్యత్, నా ఫ్యామిలీ చాలా ముఖ్యం. ఈ సమస్య వల్ల ఎందుకో భయమేస్తుంది. నిద్ర పట్టడంలేదు. ఇంకా.... నాకు ఫ్రెండ్స్‌ అంటే చాలా ఇష్టం, అయితే కాలేజ్‌ కూడా అయిపోవస్తుందని చాలా బాధగా అనిపిస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా బాధను ఎవరితో షేర్‌ చేసుకోవాలో తెలియక మీకు లేఖ రాస్తున్నా. ఈ ఫోబియా నుంచి బయటికి రాలేకపోతున్నా. నీలాంబరి గారితో బాగా మాట్లాడి ఒక డజన్‌ అరటిపండ్లు తిని కడుపు నిండాక మంచి సమాధానం ఇవ్వండి! ప్లీజ్‌ సర్‌!! – సమీర్‌

‘రాక్షసుడు పండుకున్నాడా!?! నీలాంబరక్కా!’ ‘‘పండుకున్నాడురా అరటిపండూ’’ ‘ఆన్సర్‌ ఇవ్వడా అక్కా?’ ‘‘డజన్‌ మింగాడుగా ఇవాళ! డౌటే!’’ ‘ఆ సమీర్‌కి ఆ మాత్రం తెలివి ఉండొద్దూ! మరీ డజన్‌ తినమని చెబుతాడా అక్కా?’ ‘‘హాఫ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అన్నాడని కోపమొచ్చి గంతులు వేస్తుంటే.. నేనే చెప్పా సమీర్‌ ఈజ్‌ గుడ్‌ బాయ్‌ అని.. డజన్‌ తినమన్నాడని...’’ ‘అంతటితో కోపం మింగి డజన్‌ మెక్కాడా అక్కా..? ఇప్పుడు ఆన్సర్‌ నువ్వు ఇయ్యి... భలే ఛాన్స్‌!’ ‘సమీర్‌ డోంట్‌ వర్రీ. బ్రెయిన్‌కు షుగర్‌ తగ్గితే ఫోబియాలు డిప్రెషన్లు వస్తాయి. నువ్వు హాఫ్‌ డజన్‌ అరటిపండ్లు తిని బీ హ్యాపీ’ ‘‘అక్కా.... ఒక రాక్షసుడు డజన్‌ తింటాడు.. సమీర్‌ అర డజన్‌ తింటాడు... ఇలా అయితే మా జాతి కనుమరుగు అయిపోతుంది అక్కా!’ అని అరటిపండు డిఫ్రెషన్‌లోకి వెళ్లిపోయింది.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com
 

Advertisement
 
Advertisement
Advertisement