నన్నడగొద్దు ప్లీజ్‌  | Love doctor returns 23-01-2019 | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Jan 23 2019 1:34 AM | Updated on Jan 23 2019 1:34 AM

Love doctor returns 23-01-2019 - Sakshi

హాయ్‌ అన్నయ్యా! నాకు మూడేళ్ల క్రితం ఒక అబ్బాయి ప్రపోజ్‌ చేశాడు. నాకూ తనంటే ఇష్టం ఉండటంతో ఓకే అన్నాను. అయితే ఐదు నెలలుగా తను నాతో సరిగా మాట్లాడటం లేదు. నా మెసేజ్‌లకి రిప్లై ఇవ్వడం లేదు. ‘నన్ను పెళ్లి చేసుకో’ అని అడిగితే... క్యాస్ట్‌ కారణంగా చూపించి.. ‘మా ఇంట్లో ఒప్పుకోరు’ అంటున్నాడు. పైగా ‘నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి’ అంటూ సోది చెబుతున్నాడు. నేను ప్రతిరోజూ ఏడుస్తూనే ఉంటున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యా! ప్లీజ్‌ మంచి సలహా ఇవ్వండి. – సాయి లత
వీడు దొంగ రాస్కెల్, క్యాస్ట్‌ అడ్డం పెట్టుకుని... నిన్ను వాడుకుంటున్నాడు... ఏ క్యాస్ట్‌లోనూ ఒక అమ్మాయిని కష్టబెట్టమని ఉండదు!ఏ క్యాస్ట్‌లోనూ ప్రేమను ఛిద్రం చెయ్యమని ఉండదు!క్యాస్ట్ట్‌ స్ట్రెన్త్‌ ఇస్తుంది, ప్రేమను కూల్చదు...పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మానెయ్యమను!క్యాస్ట్‌కి చెడ్డ పేరు... ప్రేమకు చీడ పెట్టొద్దని హెచ్చరించు!గుండె దిటవు చేసుకో.. ఇలాంటి వాడి అసలు రంగు ముందే బయటపడినందుకు దేవుడికి థ్యాంక్యూ చెప్పుకో..! ఆల్‌ ది బెస్ట్‌!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement