
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్, నేను డిగ్రీ, పీజీ డిస్టెన్స్‌లో చేశాను. బీఈడీ కంప్లీట్ చేశాను.
లవ్ డాక్టర్
హాయ్ సర్, నేను డిగ్రీ, పీజీ డిస్టెన్స్‌లో చేశాను. బీఈడీ కంప్లీట్ చేశాను. నాకు ఇష్టం లేకపోయినా నన్ను బలవంతంగా టీచింగ్ ఫీల్డ్‌లో జాయిన్ చేశారు మా నాన్న. రెండేళ్ల నుంచి గవర్నమెంట్ జాబ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా జాబ్ రాలేదని బాధగా ఉంది. నాకన్నా చిన్నవాళ్లు జాబ్‌లో జాయిన్ అయిపోతున్నారని, ఈ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే నా జీవితం సంకనాకి పోతుందని ప్రైవేట్ జాబ్‌కు అప్లై చేశాను. సెలక్టయ్యాను. కానీ ఇప్పుడు నాన్న ఒప్పుకోవడం లేదు. ‘నా మాట వినకుంటే నీకు నాకు సంబంధం లేదు’ అంటున్నాడు.ఇప్పుడు నా వయసు 25. డాడీ మాటలు వినీ వినీ నాకు చిరాకొస్తోంది.
ప్రశాంతంగా జాబ్ చేస్తూ చదువుకుంటా అంటున్నా వినడం లేదు. ఐనా నేనేమైనా తప్పు చేశానా? మా తమ్ముడు కూడా నెక్స్›్టమంత్ జాబ్‌లో జాయినైపోతాడు. నాకే ఎందుకు ఇలా? నా లైఫ్‌లో ఇప్పటివరకూ ఎంజాయ్ చేసిందే లేదు. ఫ్రీగా నాకు నచ్చింది చేసిందే లేదు. మా అమ్మ, నాన్న ఏం చెప్తే అదే చేశాను. ఏం చేయమంటారు? చనిపోవటానికి చాలా ట్రై చేశా. బట్, పేరెంట్స్‌కు బ్యాడ్ నేమ్ వస్తుందని, నేనేదో తప్పు చేశానేమో అని అనుకుంటారని ఆలోచించా. మనసు చాలా బాధగా ఉంటోంది. జీవితం అంటేనే చిరాకు వేస్తోంది. నేనేం చేయాలి? ‘గవర్నమెంట్ జాబ్ ఉంటేనే లైఫ్, లేదంటే లైఫ్ లేదు’ అంటున్నారు.
నేను చాలా సెన్సిటివ్. నా సమస్యను మాఫ్రెండ్స్‌కు చెప్పుకుని బాధపడతా. మా నాన్న మేం చెప్తే వినడు, బయటవాళ్లు చెప్తే వింటారు. నాకు ఇంట్లో ఉండాలంటే నరకంలా అనిపిస్తోంది. నన్నేం చేయమంటారు? ప్లీజ్ సలహా ఇవ్వండి. నా లైఫ్‌ని నాకు నచ్చినట్టు మార్చుకోవాలి. నాకు జాబ్ వస్తేనే పెళ్లి చేస్తారట. ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో గవర్నమెంట్ జాబ్ చాలా కష్టంగా ఉంది. దయచేసి సహాయం చేయండి. – వాసవి (పేరు మార్చడమైనది)
ఏంటి బంగారం! అసలు ఇది ప్రాబ్లమే కాదు!! నాన్న నువ్వు గొప్పగా ఉండాలని అనుకుంటున్నాడు! నువ్వు గొప్పా జప్పా వద్దు. హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నావు!! రెండూ జరుగుతాయి! తప్పకుండా జరుగుతాయి!! ఎలా? అని అడగొద్దు!! మంచివాళ్లకు మంచే జరుగుతుంది బంగారం! చూడు తొందరలోనే నాన్నే నీకు ఇష్టమయినది చేస్తాడు! హ్యావ్ పేషెన్స్! బ్లెస్ యూ!! ‘అబ్బా! ఎంత ప్రేమ సార్ చెల్లెళ్లంటే... ఎంజాయ్ అరటిపండు’ అని నవ్వింది నీలూ!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com