నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor love the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Sep 1 2017 12:06 AM | Updated on Sep 17 2017 6:12 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

చస్తూ బతకడం ఏంటి బ్రో! హ్యాపీగా బతకండి!! అందరి కళ్లు కుట్టే అంత సంతోషంగా బతకండి!

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ రామ్‌ గారు.. నేను ఒక పి.ఎస్‌.యు లో జాబ్‌ చేస్తున్నాను. 1 ఇయర్‌ బ్యాక్‌ ఒక అమ్మాయి కూడా మా ఆఫీస్‌లో జాయిన్‌ అయ్యింది. తనని చూడగానే నాకోసమే వచ్చిందనిపించింది. అనుకోకుండా తను నేను కొన్ని డేస్‌లోనే చాలా దగ్గరయ్యాం. ప్రపోజ్‌ కూడా చేసుకున్నాం. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. ఈ విషయం ఇంట్లో తెలిసింది. వాళ్ల అమ్మ తిట్టినా కూడా తను వినలేదు. నాతో మాట్లాడం ఇంకా ఎక్కువయ్యింది. ఈ లోగా నాకో ట్రాన్స్‌ఫర్‌ వచ్చింది.

నేను వెళ్లిపోయా వాళ్ల అమ్మ చస్తా అని బెదిరించడంతో... నాతో మాట్లాడటం తగ్గించేసింది. తనకి సంబంధం కూడా చూశారు. హాలిడేస్‌కి వచ్చినప్పుడు తనని కలిశాను. మమ్మీ, డాడీ చస్తామంటున్నారు అని బాగా ఏడ్చింది. నేను అన్ని విధాలా బాగున్నాను. వెల్‌ సెటిల్డ్‌. అయినా కూడా వాళ్లు మారడంలేదు. దాంతో మేము అనుక్షణం చస్తూ బతుకుతున్నాం. దీనికి మీ దగ్గర ఏదైనా మంచి సొల్యూషన్‌ ఉంటే చెప్పండి సార్‌. – అర్జున్‌ కృష్ణ


చస్తూ బతకడం ఏంటి బ్రో! హ్యాపీగా బతకండి!! అందరి కళ్లు కుట్టే అంత సంతోషంగా బతకండి! ప్రేమ దొరకని ఆకలి గుండెలను తొలిచేస్తున్నా... వెలిగిపోతున్న నవ్వు నీ సొంతం చేసుకో.. మనిషికి మనిషి దొరికితేనే స్నేహం కాదు ప్రియుడికి ప్రియురాలు దొరికితేనే ప్రేమ కాదు అసలు మళ్లీ జీవితంలో కలవనక్కర్లేదు! గుండె లోతుల్లో ఎక్కడో ఒక అందమయిన ఆనందం.. ఒకరిని ఒకరు తలచుకున్నప్పుడు... అంతే.. ఇక్కడే అగాధం నిండిపోతుంది! బాధ ప్రేమతో నిండిపోతుంది. ఆ తరువాత దేవుడు శాసిస్తే... అరుణాచలం పాటిస్తాడా సార్‌..’ అలాగే అనుకో.. ఏంటి సార్‌ ఈ కవిత్వం.. పిచ్చి కవిత్వం.. అర్జున్‌ కృష్ణ అమ్మో.. అయ్యో.. కుయ్యో.. మొర్రో... అంటూ ప్రేమకోసం గిలగిల లాడే పాపం పసివాడికి ఈ ఓల్డ్‌ సైకాలజీ ఏంటి సార్‌.. పోనీ ఏమయినా తెలుగులో చెప్పచ్చు కదా!

అర్థం కాని పొయెట్రీ ఏంటి సార్‌.. అర్జున్‌.. లైఫ్‌తో ఆడుకుంటున్నారు!’ దేవుడు శాసిస్తే.. ప్రేమ బతికుంటే.. ప్రేమికులిద్దరు.. బలంగా జీవిస్తే.. తప్పకుండా మంచి జరుగుతుంది....! ఓసోస్‌ ఇవాళ మంచి ఫ్లోలో ఉన్నారు సార్‌.. ఇంద అరటిపండు.. ఇది తింటూ ఉంటే కాసేపు ఆ కవిత్వమయినా ఆగుద్ది. పాపం అర్జున్‌కి ఊపిరి ఆగుద్ది. ఆల్‌ ది బెస్ట్‌ అర్జున్‌.. బీ స్ట్రాంగ్‌!!’
 - ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ,  సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,  హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com
 

Advertisement
 
Advertisement
Advertisement