నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor answers to questions | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Aug 22 2017 12:08 AM | Updated on Sep 17 2017 5:48 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ బ్రో! నాకు ఈ మధ్యే ఎం.ఎన్‌.సిలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వచ్చింది.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ బ్రో! నాకు ఈ మధ్యే ఎం.ఎన్‌.సిలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వచ్చింది. విషయం ఏంటంటే... నా 18 ఏళ్ల వయసులో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. నాకు అది ప్రేమో, ఆకర్షణో తెలియదు కానీ, అప్పుడే ప్రపోజ్‌ చేశాను. అయితే, తను రిజెక్ట్‌ చేసింది. కొన్నిరోజుల తరువాత నన్ను కలిసి... ‘ఫస్ట్‌ నువ్వు సెటిల్‌ అవ్వు... అప్పుడు చూద్దాం!’ అంది. చాలా కష్టపడి ఎమ్మెస్సీలో జాబ్‌ కొట్టాను. సెటిల్‌ అయ్యాక వెళ్లి అడిగితే మళ్లీ రిజెక్ట్‌ చేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి బ్రో? - పురుషోత్తం

పురుషోత్తమా...! ‘సార్‌.. పేరు పిలవడంలోనే ఏదో తిరకాసు అనిపిస్తుంది!’ అదేంటి నీలాంబరీ.. అంత ప్రేమగా పిలుస్తుంటే? ‘సార్‌.. మీరు ఏ అబ్బాయినీ ప్రేమగా పిలవడం ఇప్పటిదాకా చూడలేదు!’ అందుకే ఇవాళ అంత ప్రేమగా పిలుస్తున్నా.. పురుషోత్తమా! సార్‌.. ఏదో ట్విస్ట్‌ ఉండే ఉంటుంది.’ పురుషోత్తమా.. అమ్మాయి ఫస్ట్‌ టైం సారీ అని చెప్పింది! ‘అవును చెప్పింది!!’ మళ్లీ తనే వచ్చి సెటిల్‌ అయ్యాకా చూద్దాం అని చెప్పింది! అవును చెప్పింది సార్‌!!’ సెటిల్‌ అయ్యాక వెళ్తే.. నో థ్యాంక్యూ అని చెప్పి పంపించింది! అవును పంపించింది!!

ఆ బంగారు తల్లి ‘సెటిల్‌ అయ్యాక చూద్దాం’ అని చెప్పకపోతే... నువ్వు కష్టపడే వాడివా? గొప్ప ఉద్యోగం తెచ్చుకునే వాడివా? అంటే... మీ చెల్లెలు పురుషోత్తం బాగుపడాలని అరటిపండు ఇచ్చినట్లు బిస్కెట్‌ వేసిందా సార్‌?’ అదే మరి అమ్మాయిల గొప్పతనం!! సార్‌.. ఇక్కడ పిల్లవాడు హార్ట్‌ బ్రేక్‌ అయ్యి.. మైండ్‌ బ్లాక్‌ అయితే.. అమ్మాయి గొప్పదని ఎక్కిరిస్తారా? మీకు కూడా అరటిపండు ఇచ్చినట్లే ఇచ్చి హ్యాండ్‌ ఇస్తా’ అని నవ్వింది నీలాంబరి!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,  హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement