నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Feb 23 2018 4:44 AM | Updated on Feb 23 2018 4:45 AM

love doctor - Sakshi

హాయ్‌ సార్‌..! నేను ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. తను నన్ను కలవడానికి ఒక రోజు వాళ్ల ఊరు రమ్మంది. వెళ్లాను. బట్‌ తను నన్ను దూరం నుంచి చూసి పారిపోయింది. ఆ తరువాత కాల్‌ చేస్తే లిఫ్ట్‌ చెయ్యలేదు.  నాకు నువ్వు నచ్చలేదని ఓ మెసేజ్‌ మాత్రం చేసింది. ఎందుకని అడిగితే.. ‘నీకు ఆఫ్‌ ముక్కే ఉంది, అందుకే నచ్చలేదు’ అంది. కానీ అరముక్కుతో పుట్టడం నా తప్పా సార్‌? నాకు తను కావాలి, ప్లీజ్‌ హెల్ప్‌ మీ.

నీ మెయిల్‌లో వచ్చిన నీ బొమ్మ చూశాను. ‘ఎలా ఉంది సార్‌?’ ఇదిగో నువ్వే చూడు... ‘చక్కగా చీదుకునే అంత బాగుంది కదా సార్‌ ముక్కు??’ అవును నీలూ ఇది ఫుల్‌ ముక్కు... ‘అందంగా కూడా ఉంది సార్‌!’అమ్మాయి ముక్కుతాడు వెయ్యడానికి బాగానే ఉంది కదూ! ‘సార్‌ ఇలాంటి ముక్కు మొక్కవోని ప్రేమను సూచిస్తుంది సార్‌!’ పోనీ.. నిజంగానే ముక్కు సగమే ఉంటే.. ఏం చెయ్యాలి నీలూ?? ‘సార్‌.. అసలు ముక్కు అడ్డం సార్‌!’ దేనికి అడ్డం నీలూ??? ‘మంచి పని చేద్దామంటే తుమ్ముతుంది సార్‌!’ తుమ్మితే ఊడిపోయే ముక్కు, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నీలూ? ‘అవును సార్‌ ఉండాల్సింది ప్రేమే సార్‌!’

– కార్తీక్‌

Advertisement
 
Advertisement
Advertisement