
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా... మా ఇద్దరి నేపథ్యాలు వేరు. ఒకరికొకరు చాలా ఇష్టం.
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా... మా ఇద్దరి నేపథ్యాలు వేరు. ఒకరికొకరు చాలా ఇష్టం. తను లేకపోతే ఉండలేను. ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ, అమ్మకి చెబితే... వద్దంటుందేమోనని భయం. డాడీకి లవ్ అంటేనే పడదు. చనిపోతానని బెదిరిస్తారు కూడా. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నాకు పేరెంట్స్ కావాలి, తనూ కావాలి. ఇంట్లో లవ్ అని తెలియకుండా ఎలా ఒప్పించాలి అన్నా? ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. నాకు చావు తప్ప మరో దారి లేనట్లు అనిపిస్తుంది. – స్రవంతి
అవ్వ కావాలి! బువ్వ కావాలి! నాన్న కావాలి! vనాని కావాలి!! ‘సార్ ప్రకాష్ రాజ్ కావాలి! మహేష్ బాబు కావాలి!! సినిమా స్టోరీలా ఏంటి సార్.. దండకం చదువుతున్నారా..?’ ‘అక్కడ మీ చెల్లెలు అన్నా! అన్నా! అని అర్ధిస్తుంటే కామెడీ చేస్తారేంటి సార్...?’ అబ్బాయి ఏమి చేస్తాడో తెలియదు. ఆదరించగలడో.. అన్నమయినా పెట్టగలడో లేదో తెలియదు!! నీ ప్రెషర్ తట్టుకోలేక... పుసుక్కున లవ్ ఈజ్ గ్రేట్ అన్నానో... ఫ్యూచర్‌లో ఏమవుద్దో తెలియదు!! ‘అందుకని సినిమా స్టోరీ చెబుతారా? అసలు మీకు ఉత్తరం రాసి సలహా అడగడమే వేస్ట్ సార్...
అక్కడ లవ్ అండ్ లైఫ్ మ్యాటర్ మీకేమో ఏమి చెప్పాలో తెలియదు.. ఇక మీరు డాక్టర్ ఏంటి సార్ వెరీ సిల్లీ సార్...’ రెచ్చగొట్టకు నీలాంబరీ... ‘సార్ మీకు అంత సీన్ లేదు సార్ ఇవ్వాళ ఫ్రీగా అరటిపండు ఇస్తాను. ఓడిపోయానని ఒప్పేసుకోండి సార్’ స్రవంతీ! ప్రపంచమంతా ఇలాగే రెచ్చగొట్టుద్ది. ఆ బుట్టలో పడకు!! అమ్మానాన్నలను కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చెయ్యి!!వీలయితే నాని బాయ్‌ని కూడా వచ్చి మీ పేరెంట్స్‌తో మాట్లాడమను!! ‘అప్పుడు గానీ తీరదు తీట. నాని కాళ్లు విరిగి చక్రాల బల్ల మీద... అమ్మా! ఒక అరటిపండు ధర్మం చేయండి. మీకు పుణ్యం ఉంటుంది... అని రోడ్డు మీద అడుక్కోవల్సిందే..’ ధైర్యం లేని వాడు ప్రేమించకూడదు. ధైర్యం లేని వాణ్ని ప్రేమించకూడదు. ప్రేమ అంటే డ్యూయెట్ కాదు లైఫ్‌తో ఫైట్! ‘బాగానే మేనేజ్ చేశారు సార్ ఇంద అరటి పండు!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com