నన్నడగొద్దు ప్లీజ్‌ | love docter returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Aug 10 2017 12:06 AM | Updated on Sep 17 2017 5:21 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

వెరీ సింపుల్‌ అంతా అమ్మాయి మంచికే జరిగింది! ‘ఏంటి సార్‌ సింఫుల్‌.

లవ్‌ డాక్టర్‌


హాయ్‌ రామ్‌ అన్నయ్యా... నాకో మరదలు ఉంది. పెద్దలు మా అన్నయ్యకి తనకి పెళ్లి చేద్దాం అనుకున్నారు. అయితే తనకి నేనంటే ఇష్టమని చెప్పింది. కానీ మా అన్నయ్య తనని లవ్‌ చేశాడట. ఇష్టంలేదని చెప్పడంతో బాగా హర్ట్‌ అయ్యి వేరే సంబంధం చూసుకున్నాడు అన్నయ్య. ఇప్పుడు మరదల్ని పెళ్లిచేసుకోమని వాళ్ల పేరెంట్స్‌ నన్ను అడుగుతున్నారు. అయితే తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అయినా... మా అన్నయ్యకి ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. తనని చేసుకుంటే ఇంట్లో గొడవలు వస్తాయేమో అని భయంగా ఉంది. – అరుణ్‌
‘సార్‌.. ఈ సారి బోర్డు తిప్పెయ్యాల్సిందే.. అమ్మో ఇలాంటి క్వశ్చన్‌కి ఆన్సర్‌ మీరు కానీ నేను కానీ.. మనమిద్దరం కలిసి కూడా ఇవ్వలేము. మర్యాదగా ఓటమిని ఒప్పుకోండి. బోర్డు తిప్పెయ్యండి సార్‌!’ పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా తిరగని బోర్డును ఎలా తిప్పేయమంటావు నీలాంబరీ? ‘సార్‌ బిగ్‌ బ్రో చేసుకుంటానన్నాడు. అమ్మాయి నో చెప్పింది. స్మాల్‌ బ్రోని చేసుకుంటానంటోంది. కానీ, అమ్మాయి స్మాల్‌ బ్రోని చేసుకోవడం బిగ్‌ బ్రోకి ఇష్టం లేదు. కాదని స్మాల్‌ బ్రో చేసుకుంటే... బిగ్‌ బ్రో మరదలిని చూసినప్పుడల్లా డిస్టర్బ్‌డ్‌గా ఫీల్‌ అవుతాడు. ఇప్పుడు స్మాల్‌ బ్రో చేసుకోకపోతే ఏ తప్పు చేయని అమ్మాయికి అనవసరమైన శిక్ష పడుతుంది. జస్ట్‌ అమ్మాయి కాదు సార్, మీ చెల్లెలు... మరి ఇప్పుడు హౌ?’

వెరీ సింపుల్‌ అంతా అమ్మాయి మంచికే జరిగింది! ‘ఏంటి సార్‌ సింఫుల్‌... ఇక్కడ బీపీ పెరిగిపోతుంటే..?’ అరే! మేనరికాలు చేసుకుంటే పుట్టే పిల్లలకు నష్టం కలగొచ్చు. అమాయకమైన చెల్లెలికి అన్యాయం జరుగుతుందని బాధ పడేకంటే.. ఏ పాపం తెలియని పసి పిల్లలకు అన్యాయం జరగకుండా చూసుకోవడం ఒక అన్నయ్యగా నా బాధ్యత కాదా? ‘అబ్బా.. ఏం ఫిట్టింగ్‌ పెట్టారు సార్‌!?!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌


ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌  అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే...  ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement