నన్నడగొద్దు ప్లీజ్‌ | love docter returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Jul 21 2017 11:25 PM | Updated on Sep 5 2017 4:34 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ అన్నయ్యా! మా ఊరిలో ఒక అమ్మాయిని లవ్‌ చేశాను.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా! మా ఊరిలో ఒక అమ్మాయిని లవ్‌ చేశాను. మా ఇంట్లో వాళ్లకి ఆ విషయం చెప్పా... కానీ, ఆ అమ్మాయి వద్దులే అంటున్నారు. తనంటే నాకు ప్రాణం. నేను ఐ.టి.ఐ చదివాను. తను ఇంటర్‌ చదివింది. వాళ్లను ఎలా ఒప్పించాలి? ప్లీజ్‌ సార్‌ చెప్పండి లేదంటే నేను చనిపోవాలనుకుంటున్నాను. – నరేశ్‌
ఏందన్నా చనిపోయేది? ఎవరి లైఫ్‌ అని చనిపోవాలనుకుంటున్నావు? అసలు నీ లైఫ్‌... నీ లైఫ్‌ ఎలా అవుతుంది? ‘అదేంటి సార్‌.. నరేశ్‌ లైఫ్‌ నరేశ్‌ ది కాదా?’ కానే కాదు!! ‘వాట్‌ డు యూ మీన్‌ సార్‌’ నరేశ్‌ లైఫ్‌ వాళ్ల అమ్మది కాదా? వాళ్ల నాన్నకు నరేశ్‌ లైఫ్‌ మీద అధికారం లేదా? ఎలా చనిపోతానంటాడు? కు..ద..ర..దు!! నేను ఒప్పుకోను.

నన్ను ‘అన్నయ్య’ అని పిలిచాడు. వాడి లైఫ్‌ మీద నాకు కూడా అధికారం ఉంది. నరేశ్‌... దమ్ము ఉంటే లైఫ్‌లో గ్రేట్‌ మ్యాన్‌ అవ్వు. ముందు లైఫ్‌ని ప్రేమించు ఆ తరువాత లవ్‌ విల్‌ హ్యాపెన్‌!! ‘శబ్బాష్‌ సార్‌.. ఇదిగో మీ లవ్లీ అరటి పండు!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement