పొడవాటి గిటార్ | Long Guitar | Sakshi
Sakshi News home page

పొడవాటి గిటార్

Nov 4 2015 10:53 PM | Updated on Aug 21 2018 2:34 PM

పొడవాటి గిటార్ - Sakshi

పొడవాటి గిటార్

గిటార్‌లో నానా రకాలు ఉన్న సంగతి తెలిసిందే.

తిక్క  లెక్క
 

గిటార్‌లో నానా రకాలు ఉన్న సంగతి తెలిసిందే. ఏ రకమైన గిటారైతేనేం, రెండు చేతుల మధ్య ఇమిడిపోయి, వాయించడానికి అనువుగానే ఉంటుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఎలక్ట్రిక్ గిటార్ తీరే వేరు. ఇది అలాంటిలాంటి గిటార్ కాదు. ప్రపంచంలోనే అతి పొడవైన గిటార్‌గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. దీని పొడవు ఎంతో కాదు... కేవలం 43 అడుగుల 7.5 అంగుళాలు మాత్రమే.

ఇక దీని వెడల్పు 16 అడుగుల 5.5 అంగుళాలు. దీనిని పెకైత్తడం మానవమాత్రుల వల్ల కాదు. ఎందుకంటే, దీని బరువు 907 కిలోలు. దీనినెలా వాయిస్తారో మరి అని సందేహిస్తున్నారా? వాయించడానికి కాదు, కేవలం రికార్డు కోసమే టెక్సాస్ విద్యార్థులు కొందరు దీనిని తయారు చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement