సల్మాన్‌తో లాంగ్ డ్రైవ్?

సల్మాన్‌తో  లాంగ్ డ్రైవ్? - Sakshi


గాసిప్రణ్‌బీర్‌కపూర్‌తో ప్రేమలో ఉన్నప్పుడు సల్మాన్‌తో అంతంతమాత్రంగానే ఉన్న కత్రినా కైఫ్ బ్రేకప్ అయ్యాక మాజీ ప్రియుడు సల్మాన్‌ఖాన్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యారనే వార్తలు బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సల్మాన్‌ఖాన్ -కత్రినాకైఫ్‌లు తరచుగా అక్కడ క్కడ జంటగా కనిపిస్తుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతున్నాయి.కత్రినా కైఫ్ తాను నటించిన తాజా సినిమా ప్రచారంలో భాగంగా సహనటుడు ఆదిత్యారాయ్ కపూర్‌తో కలిసి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన షోలో పాల్గొన్నారు. సడన్‌గా అక్కడికి సల్మాన్‌ఖాన్ రావడంతో అక్కడంద రూ ఆశ్చర్యపోయారట. ఈ  షో అయిపోయేంతవరకూ కత్రినా కైఫ్ కోసం వెయిట్ చేశారు సల్మాన్. ఆ తర్వాత తన  డ్రైవర్‌ను పంపించేసిన కత్రిన వెంటనే సల్మాన్‌ఖాన్ కారుతో లాంగ్‌డ్రైవ్‌కు వెళిపోయారట. మరి వీరిద్దరి మధ్య బంధం ఎంతకాలమో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top