ఫ్రూటీ బ్యూటీ

Lemon juice Natural Cleanser Cleanses The Skin - Sakshi

బ్యూటిప్స్‌

ఆయిలీ స్కిన్‌... 
►నిమ్మరసం సహజమైన క్లెన్సర్‌. చర్మాన్ని శుభ్రం చేస్తుంది. చర్మంలో అదనపు జిడ్డను తొలగిస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానివ్వదు. పదిద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డులోని తెల్లసొనను బాగా కలిపి ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది ఆయిలీ స్కిన్‌కు చక్కటి ఫేస్‌ ప్యాక్‌. 

►రకరకాల పండ్లను, సౌందర్యసాధనాలను కలిపి ప్యాక్‌ తయారు చేసుకునే సమయం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. డ్రైస్కిన్‌ అయితే...

►టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ నిమ్మరసం, టీ స్పూన్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి, మెడకు రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్‌... ఆయిల్‌ వాడవచ్చు.

►ఒక టీ స్పూన్‌ తేనెలో టీ స్పూన్‌ పాలు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
నార్మల్‌ స్కిన్‌కి...

►ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జు ఒక కçప్పులో కోడిగుడ్డు వేసి(పచ్చసొనతో సహా) బ్లెండ్‌ చేసి సగం మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. మసాజ్‌ తర్వాత మిగిలిన సగం మిశ్రమాన్ని ప్యాక్‌ వేసి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఫలితం వెంటనే çకనిపిస్తుంది. దీనిని నార్మల్‌ స్కిన్‌తోపాటు అన్నిరకాల చర్మానికీ వేయవచ్చు.

►ముఖం మీద నల్లటి మచ్చలుంటే ప్రతిరోజూ క్యారట్‌ రసం రాస్తుండాలి. వారం రోజులకే మంచి ఫలితం ఉంటుంది. మచ్చలు మాసిపోవడంతోపాటు చర్మం కాంతిమంతమవుతుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top