ఖాదీ హో | Khadi a Style For Youth Independent Trends | Sakshi
Sakshi News home page

ఖాదీ హో

Mar 29 2019 1:40 AM | Updated on Mar 29 2019 1:40 AM

Khadi a Style For Youth Independent Trends - Sakshi

స్వాతంత్య్ర భావనలకు ప్రతీక ఖాదీ.స్వరాజ్య పోరాట చిహ్నం ఖాదీ.ఖాదీ అంటే అదేదో ఫ్రీడమ్‌ ఫైటర్ల బ్రాండ్‌ అనేది ఓ పాత  నమ్మకం. ఇప్పుడు ఫ్రీడమ్‌ను ఇష్టపడేది యువతే.అలాంటప్పుడు యూత్‌ స్వతంత్ర పోకడలకు ఖాదీ ఓ స్టైల్‌ స్టేట్‌మెంట్‌ ఎందుకు కాకూడదు?దేశం కోసం జయహో అన్నట్టే... తమ దేహం మీద స్టైల్‌గా ఖాదీ హో అంటోందిప్పటి యువత.  

►మోడ్రన్‌గా కనిపించాలంటే ఖాదీ చీరకు బ్లౌజ్‌గా లూజ్‌ క్రాప్‌టాప్స్, షర్ట్స్, జాకెట్‌ని ఎంపిక చేసుకోవచ్చు. సింపుల్‌ అండ్‌ మార్వలెస్‌ అనే కితాబులు పొందవచ్చు. 

►‘ఖాదీ చీరనా! అది బామ్మల కట్టు మనకొద్దు’ అనే మాట ఈ నయాస్టైల్‌ చూస్తే మార్చేసుకుంటారు. తమ వార్డ్రోబులో ఖాదీకి ప్రత్యేక స్థానం ఇస్తారు. 

►వెస్ట్రన్‌ డ్రెస్‌ల మీదకు వేసి షోల్డర్‌లెస్‌ క్రాప్స్‌ ఖాదీ చీరను అందాన్ని కూడా వినూత్నం చేసేసింది. ఆధునిక మహిళ చేత అభినందనలు అందుకుంటోంది. 

►ఒకప్పుడంటే ముడులు వేసే రవికలు ఉండేవి. ఇప్పుడా స్టైల్‌ మారి కొత్తగా రూపుదిద్దుకుంది. కుచ్చులున్న జాకెట్‌ ముడితో ఖాదీ కట్టు మరింత కలర్‌ఫుల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement