స్లిప్పర్స్‌కి నగలు | Jewelry to slippers | Sakshi
Sakshi News home page

స్లిప్పర్స్‌కి నగలు

Mar 2 2017 10:53 PM | Updated on May 24 2018 2:36 PM

స్లిప్పర్స్‌కి నగలు - Sakshi

స్లిప్పర్స్‌కి నగలు

ఎండలు మండుతున్నాయి. అంటే, వేసవి వచ్చేసినట్టే! సాయంకాలాలు షికార్లు షరా మామూలే!

న్యూలుక్‌

ఎండలు మండుతున్నాయి. అంటే, వేసవి వచ్చేసినట్టే! సాయంకాలాలు షికార్లు షరా మామూలే! కంఫర్ట్‌గా ఉండే స్లిపర్స్‌ వేసుకొని అలా కాలి నడకన సాయంకాలపు పిల్లగాలులను ఆస్వాదించాలని వెళ్లాలనుకుంటున్నారా! అయితే, పాదాలకు అందమైన డిజైనర్‌ స్లిప్పర్స్‌ ఉండాల్సిందే! ఈవెనింగ్‌ వాక్‌కి ఖరీదైన చెప్పులు ఎందుకు అని ఆలోచించేవారు సొంతంగా ఇలాంటి డిజైనర్‌ చెప్పులను తయారుచేసుకోవచ్చు. డ్రెస్సులకు మ్యాచింగ్‌గా ధరించవచ్చు.

డ్రెస్సులకు ఎంబ్రాయిడరీ ప్యాచ్‌ వర్క్‌ చేయడానికి బోలెడన్ని డిజైన్స్‌ మార్కెట్లో రెడీమేడ్‌గా లభిస్తున్నాయి. వాటిలో కావల్సిన రంగు, డిజైన్స్‌ ఎంచుకొని తెచ్చుకోవాలి. మరికాస్త తీరిక, ఆసక్తి, సృజన ఉన్నవారు పూసలు, స్టోన్స్‌ ఉపయో గించి, క్లాత్‌ పువ్వులు, లేసులు తయారు చేసుకోవచ్చు. ఈ డిజైన్స్‌ని చెప్పులకు  దారంతో కుట్టేయడం లేదా ప్లాస్టిక్‌ వైర్‌తో అల్లడం చేస్తే ఇలా ముచ్చటైన డిజైనర్‌ స్లిప్పర్స్‌ రెడీ. డిజైనర్‌ డ్రెస్సుల మీదకూ ఇలాంటి డిజైనర్‌ చెప్పులు ధరించవచ్చు.


 

Advertisement
 
Advertisement
Advertisement