ఐటీ కే మా ఓటు! | IT Kay our vote! | Sakshi
Sakshi News home page

ఐటీ కే మా ఓటు!

Jul 2 2014 11:46 PM | Updated on Sep 2 2017 9:42 AM

ఐటీ కే మా ఓటు!

ఐటీ కే మా ఓటు!

యువత ఏ రంగాన్ని ఇష్టపడుతోంది? అనే విషయంపై టిసియస్(టాటా కన్సల్టెన్సీ సర్వీస్) సంస్థ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. దీన్ని బట్టి ఎంతమంది ఏ రంగాన్ని ఇష్టపడుతున్నారంటే...

యువత ఏ రంగాన్ని ఇష్టపడుతోంది? అనే విషయంపై టిసియస్(టాటా కన్సల్టెన్సీ సర్వీస్) సంస్థ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. దీన్ని బట్టి ఎంతమంది ఏ రంగాన్ని ఇష్టపడుతున్నారంటే...
 ఐటి రంగం  36 శాతం
  ఇంజనీరింగ్  20 శాతం
  మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్  10 శాతం
 ‘‘ఐటీలో ఎప్పటికప్పుడు రకరకాల విభాగాలను ఎంచుకుంటున్నారు.  ఇష్టం అనే ప్రాతిపదికన కాకుండా డిమాండ్ ప్రతిపాదికనే విద్యార్థుల ఎంపికలు ఆధారపడి ఉంటున్నాయి. ఆకర్షణీయమైన వేతనం, సమాజంలో గౌరవం..మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని యువత ఐటీ, ఇంజనీరింగ్ రంగాలను ఇష్టపడుతోంది’’ అంటున్నారు టీసీయస్ డెరైక్టర్ అజయ్ ముఖర్జీ.

 ‘యువత-సోషల్ మీడియాకు’ సంబంధించి సర్వేలో తేలిందేమిటంటే...
  ఫేస్‌బుక్‌ను 76 శాతం మంది మోస్ట్ ‘ప్రిఫర్‌డ్ సోషల్ నెట్‌వర్కింగ్ పోర్టల్’గా గుర్తిస్తున్నారు.
 
ప్రతి రోజూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్నట్లు 22 శాతం మంది చెబుతున్నారు.
 
ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమకు వంద మందికి  పైగా మిత్రులు ఉన్నట్లు 53 శాతం మంది చెబుతున్నారు.
 
సోషల్ మీడియా ద్వారా సమకాలీన విషయాలను తెలుసుకోగలుగుతున్నామని 87 శాతం మంది చెబుతున్నారు.
 
23 శాతం మందికి మాత్రమే ట్విటర్ ఎకౌంట్ ఉంది.
 ‘‘ట్విటర్ తక్కువగా ఉపయోగించడానికి కారణం ఏమిటి?’’ అని అడిగితే-
 ‘‘ట్విటర్ సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పాపులర్ కాలేదు’’ అనే అభిప్రాయం ఎక్కువగా వినిపించింది.
 సోషల్ యాక్టివిటీలో, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని  అందిపుచ్చుకోవడంలో యువత ముందుందని టిసియస్  సర్వే చెబుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement