breaking news
tata consultancy service
-
నూతన శకంలోకి అడుగుపెట్టిన టాటా గ్రూప్
ముంబై : టాటా గ్రూప్ ఓ నూతన శకంలోకి అడుగుపెట్టింది. బహుళ జాతీయ సంస్థగా పేరొందిన ఈ గ్రూప్‌కు చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్నిరోజులు తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా నుంచి ఎన్ చంద్రశేఖరన్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. టాటా సన్స్‌కు చైర్మన్‌గా ఉంటూనే చంద్రశేఖరన్ గ్రూప్‌లో అత్యంత కీలకమైన టెక్ అగ్రగామి టీసీఎస్‌కు కూడా ఈయన చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 150 ఏళ్లు కలిగిన టాటా గ్రూప్‌కు తొలిసారి నాన్-పార్సి చైర్మన్‌గా చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. దేశంలో అతిపెద్ద సాప్ట్ వేర్ ఎగుమతిదారిగా టీసీఎస్ ను రూపొందించిన ఘనతతో చంద్రశేఖరన్ ఎక్కువగా పేరొందారు. టాటాసన్స్ చైర్మన్‌గా నేడు బాధ్యతలు చేపట్టిన ఎన్.చంద్రశేఖరన్ నిన్న టీసీఎస్ సీఈఓ హోదాలో ఆఖరి బోర్డు సమావేశం నిర్వహించారు. ఆ బోర్డు సమావేశంలో ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించారు. రూ.16వేల కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించారు. టాటా సన్స్ కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రశేఖర్, వివిధ కంపెనీల సీఈవోలతో అధికారికంగా భేటీ అయ్యారు. -
ఐటీ కే మా ఓటు!
యువత ఏ రంగాన్ని ఇష్టపడుతోంది? అనే విషయంపై టిసియస్(టాటా కన్సల్టెన్సీ సర్వీస్) సంస్థ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. దీన్ని బట్టి ఎంతమంది ఏ రంగాన్ని ఇష్టపడుతున్నారంటే... ఐటి రంగం 36 శాతం ఇంజనీరింగ్ 20 శాతం మీడియా, ఎంటర్టైన్మెంట్ 10 శాతం ‘‘ఐటీలో ఎప్పటికప్పుడు రకరకాల విభాగాలను ఎంచుకుంటున్నారు. ఇష్టం అనే ప్రాతిపదికన కాకుండా డిమాండ్ ప్రతిపాదికనే విద్యార్థుల ఎంపికలు ఆధారపడి ఉంటున్నాయి. ఆకర్షణీయమైన వేతనం, సమాజంలో గౌరవం..మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకొని యువత ఐటీ, ఇంజనీరింగ్ రంగాలను ఇష్టపడుతోంది’’ అంటున్నారు టీసీయస్ డెరైక్టర్ అజయ్ ముఖర్జీ. ‘యువత-సోషల్ మీడియాకు’ సంబంధించి సర్వేలో తేలిందేమిటంటే... ఫేస్‌బుక్‌ను 76 శాతం మంది మోస్ట్ ‘ప్రిఫర్డ్ సోషల్ నెట్వర్కింగ్ పోర్టల్’గా గుర్తిస్తున్నారు. ప్రతి రోజూ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నట్లు 22 శాతం మంది చెబుతున్నారు. ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమకు వంద మందికి పైగా మిత్రులు ఉన్నట్లు 53 శాతం మంది చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా సమకాలీన విషయాలను తెలుసుకోగలుగుతున్నామని 87 శాతం మంది చెబుతున్నారు. 23 శాతం మందికి మాత్రమే ట్విటర్ ఎకౌంట్ ఉంది. ‘‘ట్విటర్ తక్కువగా ఉపయోగించడానికి కారణం ఏమిటి?’’ అని అడిగితే- ‘‘ట్విటర్ సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పాపులర్ కాలేదు’’ అనే అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. సోషల్ యాక్టివిటీలో, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో యువత ముందుందని టిసియస్ సర్వే చెబుతోంది.