ఎస్‌ దుర్గ

International Film Festival at goa - Sakshi

గోవాలో వారం రోజులుగా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. ఫెస్టివల్‌ రేపటితో ఎండ్‌ అవుతోంది. మలయాళీ చిత్రం ‘ఎస్‌ దుర్గ’ ను స్క్రీనింగ్‌కి ఒప్పుకోం అంటే ఒప్పుకోం అన్నవాళ్లు.. ఈ వారం రోజులు ఆ సినిమా డైరెక్టర్‌ శశిధరన్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌తో ఫైట్‌ చేస్తే చివరికి ఓకే అన్నారు. ఇవాళ సాయంత్రమే స్క్రీనింగ్‌. మగలోకం ఎలా ఉందీ ఈ సినిమాలో చూపించారు.

ఎలా ఉండకూడదో కూడా చెప్పారు. సంప్రదాయవాదులకు కోపం వచ్చింది. ఒత్తిడి తెచ్చి బ్యాన్‌ చేయించారు. డైరెక్టర్‌ గట్టిగా నిలబడి స్క్రీన్‌ చేయించుకుంటున్నాడు. నార్త్‌ ఇండియన్‌ అమ్మాయి, కేరళ అబ్బాయి కలిసి ఒక అర్ధరాత్రి ఊరి నుంచి పారిపోతారు. ఆ జర్నీలో దుర్గ (రాజశ్రీ దేశ్‌పాండే) అనే ఆ అమ్మాయి పరిస్థితులతో పోరాడ్డం సినిమా. మరి మన హీరో పోరాడడా? మగాళ్ల ప్రపంచంలో మగాళ్లు పోరాడ్డం ఏమంత కష్టం చెప్పండి. స్త్రీగా నెగ్గుకు రావడమే.. లైఫ్‌ అండ్‌ డెత్‌ ఇష్యూ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top