షారుక్‌ ఖాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ | Shah Rukh Khan Film Festival begins on 31st October | Sakshi
Sakshi News home page

షారుక్‌ ఖాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌

Oct 26 2025 4:28 AM | Updated on Oct 26 2025 4:28 AM

Shah Rukh Khan Film Festival begins on 31st October

బర్త్‌ డేకి ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌  ప్లాన్‌ చేశారు షారుక్‌ ఖాన్‌. నవంబరు 2న షారుక్‌ 60వ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘షారుక్‌ ఖాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ పేరిట షారుక్‌ నటించిన కొన్ని సూపర్‌హిట్‌ సినిమాలు ఈ నెల 31 నుంచి థియేటర్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. ‘‘అక్టోబరు 31న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌  ప్రారంభం అవుతుంది. ‘దిల్‌ సే, దేవ్‌దాస్, మై హూ నా, ఓం శాంతి ఓం,  చెన్నై ఎక్స్‌ప్రెస్‌’... ఇలా నా కెరీర్‌లోని కొన్ని సూపర్‌హిట్‌ సినిమాలు థియేటర్స్‌లో మళ్లీ ప్రదర్శితం కానున్నాయి. ఈ సినిమాల్లోని మనిషి (తనను తాను ఉద్దేశించి) మారలేదు. జస్ట్‌ హెయిర్‌ మాత్రం మారింది.

ఇంకాస్త అందంగా తయారయ్యాడు. పీవీఆర్‌ ఐనాక్స్‌ అసోసియేషన్‌తో భారతదేశంలోని కొన్ని థియేటర్స్‌లో మాత్రమే ఈ సినిమాలు ప్రదర్శితం అవుతాయి. నార్త్‌ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్‌ దేశాల్లో వైఆర్‌ఎఫ్‌ (యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌) సంస్థ ఈ సినిమాలను రిలీజ్‌ చేస్తోంది’’ అని షారుక్‌ పేర్కొన్నారు. అక్టోబరు 31న  ప్రారంభమయ్యే  ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నవంబరు 14 వరకు కొనసాగుతుందట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘కింగ్‌’ సినిమాతో షారుక్‌ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంతో ద్వారా కుమార్తె సుహానా నటిగా పరిచయం కానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement